జుట్టు ఆరోగ్యం కోసం మాధురీ దీక్షిత్ చెబుతున్న చిట్కాలు..

జుట్టు ఆరోగ్యం కోసం మాధురీ దీక్షిత్ చెబుతున్న చిట్కాలు..
సహజ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది మాధురీ దీక్షిత్ నేనే. DIY హెయిర్ మాస్క్‌ల నుండి క్విక్ హెయిర్ ఆయిల్ వరకు, మాధురీ దీక్షిత్ నేనే మీకు సులభమైన ప్యాక్‌లు లేదా మిశ్రమాలను తన Instagram ద్వారా తెలియజేస్తున్నారు.

సహజ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది మాధురీ దీక్షిత్ నేనే. DIY హెయిర్ మాస్క్‌ల నుండి క్విక్ హెయిర్ ఆయిల్ వరకు, మాధురీ దీక్షిత్ నేనే మీకు సులభమైన ప్యాక్‌లు లేదా మిశ్రమాలను తన Instagram ద్వారా తెలియజేస్తున్నారు.

దీక్షిత్ తన జుట్టు సంరక్షణ దినచర్య గురించి మాట్లాడింది. వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే తడి జుట్టును ఆరబెట్టడానికి మైక్రోఫైబర్ హెయిర్ ర్యాప్‌లను ఉపయోగించమని సూచిస్తున్నారు.

"రోజులో తగినంత నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండండం ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను" అని నటి పేర్కొంది.

జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండడం కోసం అర కప్పు కొబ్బరి నూనె , 15-20 కరివేపాకులు, 1 టీస్పూన్ మెంతి గింజలు, 1 చిన్న తురిమిన ఉల్లిపాయను ఉపయోగిస్తానని తెలిపింది.

ఈ పదార్థాలు ఎందుకు ఖచ్చితంగా ఉపయోగించాలో చెబుతూ, “కొబ్బరి నూనె మన జుట్టును పర్యావరణం నుంచి కాపాడుతుంది. వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇది మీ జుట్టుకు తేమను అందిస్తుంది. మెంతి గింజలు స్కాల్ప్ ఇరిటేషన్, చుండ్రు నుంచి రక్షిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది.

నూనెను ప్రతి 3-4 రోజులకు ఒకసారి లేదా ప్రతి శనివారం రాత్రి గోరు వెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. మరుసటి రోజు బాగా వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో మాత్రమే కడగాలి.

హెయిర్ మాస్క్ కోసం ఇంట్లో ఉండే పదార్థాలనే ఉపయోగిస్తానని తెలియజేసింది.1 పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనె వీటన్నింటిని బాగా కలపండి. దీనిని తల అంతా పట్టించాలి. అప్లై చేసిన తర్వాత, షవర్ క్యాప్ ధరించండి. 30-40 నిమిషాలు ఉంచి అనంతరం కడగాలి. “ఈ హెయిర్ మాస్క్ ప్రాథమికంగా ఉపశమనానికి, వెంట్రుకలను మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టును సిల్కీగా ఉంచుతుందని మాధురీ తెలియజేసింది.

Tags

Read MoreRead Less
Next Story