Onions: వేసవిలో ఉల్లిపాయ.. ఆరోగ్య ప్రయోజనాలు.. ఔషధ గుణాలు అమోఘం..

Onions: వేసవిలో ఉల్లిపాయ.. ఆరోగ్య ప్రయోజనాలు.. ఔషధ గుణాలు అమోఘం..
onions: ఇవి తలనొప్పి, గుండె జబ్బులు, నోటి పుండ్లు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించేవారు.

Onions: అన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ముఖ్యమైనవి అయినప్పటికీ, కొన్ని రకాలు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి.

అందులో ముఖ్యమైనవి ఉల్లిపాయలు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటినా ఉల్లిపాయ లేకపోతే కూర వండడం చాలా కష్టం. ఉల్లికి చలవ చేసే గుణం ఉంది. కూరకు రుచిని, మనిషికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవానికి ఉల్లిపాయలలోని ఔషధ గుణాలను పురాతన కాలంలోనే గుర్తించబడ్డాయి. ఇవి తలనొప్పి, గుండె జబ్బులు, నోటి పుండ్లు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించేవారు.

ఇక వేసవి కాలం వచ్చిందంటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం రాత్రి పూట అన్నం వండి అందులో ఉల్లిపాయ, పాలు వేసి తోడు పెట్టేవారు.. ఉదయాన్నే అది తింటే వడ దెబ్బ తగలకుండా, శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుందని విశ్వసించేవారు.

వేసవిలో శరీరం వేడెక్కుతున్న కొద్దీ చెమట రూపంలో లవణాలను కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. వేసవి తాపం వల్ల మనం ప్రతికూలంగా ప్రభావితమైనప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన జ్వరం, తలనొప్పి, తల తిరగడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి.

ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వేసవి ఎండ ప్రభావం నుంచి కాపాడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ హిస్టమైన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఉల్లిపాయలు వేసవిలో ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణ రసాల స్రావాన్ని పెంచడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం చర్మం కాలిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.

వేసవిలో ఉల్లిపాయల యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

* వేసవి తాపాన్ని ఎదుర్కోవడానికి ఉల్లిపాయ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, హీట్ స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

* ఉల్లిపాయ హీట్ స్ట్రోక్‌ను నివారించడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరం కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇది అద్భుతమైన స్కిన్ టానిక్‌గా కూడా ఉపయోగించబడుతుంది.

* ఉల్లి జీర్ణకోశ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఫ్లేవనాయిడ్లు, క్వెర్సెటిన్ ఉండటం వల్ల జీర్ణ క్రియకు అద్భుతమైన టానిక్‌గా పనిచేస్తుంది.

* ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

* జ్వరం వచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలుగా తరిగి బట్టలో వేసి మూటకట్టి నుదుటిపై ఉంచాలి. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

పచ్చి ఉల్లిపాయ ముక్కల మీద నిమ్మరసం చల్లుకుని తినవచ్చు లేదా పెరుగన్నంలో వేసుకుని తింటే కూడా రుచిగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story