Period Cramps: భరించలేని బాధ.. పీరియడ్ పెయిన్‌ని కంట్రోల్ చేసే హోమ్ రెమిడీస్

Period Cramps: భరించలేని బాధ.. పీరియడ్ పెయిన్‌ని కంట్రోల్ చేసే హోమ్ రెమిడీస్
Period Cramps: నెలసరి వస్తోందంటేనే భయం. భరించలేని కడుపు నొప్పి.. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు.

Period Cramps: నెలసరి వస్తోందంటేనే భయం. భరించలేని కడుపు నొప్పి.. దీన్నే వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. మహిళల్లో సగానికి పైగా నెలసరి నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది మహిళలకు నెలవారీ నొప్పి చాలా స్వల్పంగా ఉంటుంది. ఇలా నొప్పి రావడం చెడు సంకేతమేమి కాదు. పీరియడ్ నొప్పి సాధారణంగా మీ ఆరోగ్య లోపమని భావించకూడదు. అది అందరిలో సాధారణంగా కనిపించే లక్షణం. నొప్పి ఎక్కువ రోజులు ఉండి మరీ భరించలేనిదిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పీరియడ్ నొప్పిని తగ్గించేందుకు సురక్షితమైన ఇంటి నివారణలు చిట్కాలు కొన్ని ఉన్నాయి.. అవి చేస్తున్నా ఏ మాత్రం రిలీఫ్‌గా అనిపించకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది.

* ఆక్యుపంక్చర్ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ పురాతన వైద్య పద్ధతిలో నాడీ వ్యవస్థను సడలించడం, అంతర్గత అవయవాలకు మరింత రక్తం ప్రవహించేటట్లు చేయడం ద్వారా నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా కొన్ని యోగా ఎక్సర్‌సైజులు కూడా నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. ఈ వ్యాయామాలు మీ కండరాలు సాగదీస్తుంది.




* పీరియడ్ నొప్పిని తగ్గించే హీటింగ్ ప్యాడ్‌. గర్భాశయం అనేది ఒక కండరం. కాబట్టి వేడి కాపడం పెడితే కండరాలు సడలి నొప్పి తీవ్రత తగ్గుతుంది. నొప్పి నివారణ కోసం ఆయిల్ మసాజ్ కూడా బాగా పని చేస్తుంది. ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పి వచ్చే ప్రాంతంలో నిదానంగా చేతి వేళ్లతో మసాజ్ చేయాలి.



* నొప్పి నుండి ఉపశమనం కోసం హెర్బల్ టీ: అనేక శతాబ్దాలుగా రుతుస్రావం తీవ్రంగా ఉన్న మహిళలు హెర్బల్ టీలను ఉపయోగిస్తున్నారు. కామోమిల్ టీ, పిప్పరమింట్ టీలు నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు తరచుగా సిఫార్సు చేయబడతాయి. ఎందుకంటే ఇవి శరీరానికి ప్రశాంతతను కలిగిస్తాయి. బాదం, నల్ల బీన్స్, పాలకూర, పెరుగు, పీనట్ బటర్ సహా అనేక ఆహారాలలో లభించే మెగ్నీషియమ్ నొప్పి నుండి కాస్త రిలీఫ్ ఇస్తుంది.



* మీ డైట్‌లో చిన్న చిన్న మార్పులు కూడా పీరియడ్ క్రాంప్స్‌ని తగ్గిస్తాయి. పరిశోధకులు డిస్మెనోరియాతో బాధపడుతున్న కొంత మంది మహిళలకు తక్కువ కొవ్వు ఉన్న ఆహారం అందించారు. దీంతో వారు నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు గుర్తించారు.



ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. మాంసాహారులైతే చేపలు వారానికి రెండు సార్లు తీసుకోవడానికి ప్రయత్నించాలి.

Tags

Read MoreRead Less
Next Story