Bone Strengthen Foods: కాళ్ల నొప్పులు.. కచ్చితంగా తినవలసిన పదార్థాలు..

Bone Strengthen Foods: కాళ్ల నొప్పులు.. కచ్చితంగా తినవలసిన పదార్థాలు..
Bone Strengthen Foods: కాస్త దూరం నడిస్తే చాలు కాళ్ల నొప్పులు. చిన్నా పెద్దా తేడా లేదు. అందరిదీ ఇదే పరిస్థితి.

Bone Strengthen Foods: కాస్త దూరం నడిస్తే చాలు కాళ్ల నొప్పులు. చిన్నా పెద్దా తేడా లేదు. అందరిదీ ఇదే పరిస్థితి. తీసుకుంటున్న ఆహారం, వ్యాయామం లేకపోవడం, శరీరానికి కావలసిన డి విటమిన్ అందకపోవడం ఇవన్నీ ఎముక బలహీనతకు కారణాలు. కొందరికి చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరుగుతాయి.

ఎముకల్లో పటుత్వం లేకపోతే ఇలా జరుగుతుంది. కాల్షియం తక్కువగా ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం. సప్లిమెంట్‌లపై ఆధారపడకుండా సరైన ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది. ఎముకలు దృఢంగా ఉండాలంటే మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాల్సిన అంశాలు..

1. నట్స్



బాదం, వేరుశెనగల్లో మీకు కావలసిన కాల్షియం మాత్రమే కాకుండా మెగ్నీషియం, భాస్వరం కూడా లభిస్తుంది. మెగ్నీషియం ఎముకలలో కాల్షియం గ్రహించి, నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని దాదాపు 85 శాతం భాస్వరం ఎముకలు, దంతాలలో ఉంటుంది. ఎముకల గాయాలను నివారించడానికి ప్రతిరోజూ కొన్ని బాదం కానీ వేరుశెనగ గింజలు కానీ తినడం అలవాటు చేసుకోవాలి.

2. ఆకు పచ్చని కూరగాయలు



విటమిన్ K లోపం బోలు ఎముకల వ్యాధి మరియు పగుళ్లకు దారితీస్తుంది. బ్రోకలీ, పాలకూర, క్యాబేజీ వంటి వాటిల్లో విటమిన్ K అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం.

3. చేప



ప్రపంచ జనాభాలో దాదాపు 50 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి కి సూర్యరశ్మి ప్రధాన వనరు. కానీ ప్రస్తుత జీవన విధానంలో తగినంత సూర్యరశ్మిని పొందలేకపోతున్నారు. చేపల్లో విటమిన్‌ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.

4. పెరుగు



పెరుగులో ప్రోటీన్ మరియు మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. కాల్షియంను అందిస్తుంది. అందువల్ల, బలమైన ఎముకలను కలిగి ఉండేందుకు పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి.

5. సిట్రస్ పండ్లు



సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతుంది. కీళ్ల నొప్పుల నుంచి దూరం చేస్తుంది. అందువల్ల, అన్ని రకాల ఎముకల గాయాలను నివారించడానికి మీ రోజువారీ ఆహారంలో దాదాపు 88 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. నిమ్మ, ద్రాక్ష, నారింజ, జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవితానికి అన్ని రకాల పోషకాలను శరీరానికి అందించేందుకు పండ్లు, కూరగాయలు, చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పైన పేర్కొన్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎముకల్లో పటుత్వం వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story