వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు.. డెంగ్యూ నుండి సురక్షితంగా ఉండాలంటే..

వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు.. డెంగ్యూ నుండి సురక్షితంగా ఉండాలంటే..
వర్షాకాలం వచ్చిందంటే ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి. వైరల్ ఫీవర్లు చుట్టుముట్టి ప్రజల్ని అనారోగ్యంపాలు చేస్తాయి.

వర్షాకాలం వచ్చిందంటే ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి. వైరల్ ఫీవర్లు చుట్టుముట్టి ప్రజల్ని అనారోగ్యంపాలు చేస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఫీవర్లు మరింత త్వరగా అటాక్ చేస్తాయి. ముఖ్యంగా దోమలు కుట్టకుండా వర్షాకాలంలో జాగ్రత్త పడాలి. వాటి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

యమునా నది పొంగుతూ వరదలో అల్లాడుతున్న దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కాబట్టి ముందస్తు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం. తద్వారా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోగలుగుతారు. వర్షాకాలం రాకతో డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు ఎక్కువగా ఉంటాయి.

డెంగ్యూ అనేది ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. డెంగ్యూ జ్వరాలు రెండు రూపాల్లో ఉంటాయి - క్లాసికల్ డెంగ్యూ జ్వరం, దీనిని "బ్రేక్ బోన్" ఫీవర్ అని కూడా పిలుస్తారు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (DHF), ఇది ప్రాణాంతకం. అధికారులు అందించిన సమాచారం డెంగ్యూ యొక్క ముందస్తు హెచ్చరిక లక్షణాలు సాధారణంగా దోమ కరిచిన 5-6 రోజుల తర్వాత కనబడతాయి.

ఈ లక్షణాలలో ముఖ్యంగా కనిపించేవి.. జ్వరం, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, పొత్తికడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, అసౌకర్యం, అనారోగ్యం వంటి లక్షణాలతో పాటు 5వ రోజున ఎర్రటి మచ్చలతో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా సకాలంలో వైద్య సలహా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డెంగ్యూ బారిన పడకుండా ఉండటానికి, సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తాయల్ మాట్లాడుతూ, చర్మంపై 20 శాతం నుండి 30 శాతం డిఇఇటి లేదా 20 శాతం పికారిడిన్ ఉన్న రిపెల్లెంట్‌ను ఉపయోగించాలని చెప్పారు. దోమలు కుట్టకుండా శరీరం మొత్తం కప్పి ఉంచే లైట్ కలర్ రంగు వస్త్రాలను ధరించాలని చెప్పారు.

నివాసాల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తలుపులకు, కిటికీలకు దోమ తెరలను అమర్చుకోవాలి. ఒంట్లో నలతగా ఉండి, జ్వర లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.

Tags

Read MoreRead Less
Next Story