Urine Hold: అర్జంట్‌గా బాత్‌రూమ్ వస్తున్నా ఆపుకుంటున్నారా..

Urine Hold: అర్జంట్‌గా బాత్‌రూమ్ వస్తున్నా ఆపుకుంటున్నారా..
Urine Hold: మూత్రాశయాన్ని ఖాళీ చేయకపోవడం వల్ల మరొక సమస్య అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రాన్ని ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.

Urine Hold: అర్జంట్‌గా బాత్‌రూమ్ వస్తుంది.. ఏదో పని.. ఆ పని అయ్యాక వెళ్లొచ్చని వాయిదా.. అయితే అలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు వైద్యులు. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపి ఉంచితే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి మూత్రాశయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితి వస్తుంది.

నోయిడా మదర్‌హుడ్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ తన్వీర్ ఔజ్లా మూత్రానికి సంబంధించిన అనేక సమస్యల గురించి వివరించారు. మూత్రాన్ని ఎంతసేపు ఆపి ఉంచొచ్చు..

చిన్న పిల్లల మూత్రాశయం 1-2 గంటలు మాత్రమే హోల్డ్ చేస్తుంది. పిల్లలు కొంచెం పెద్దవారైనప్పుడు, వారు 2-4 గంటలు మూత్రాన్ని ఆపగలరు. ఇక పెద్దవారు గరిష్టంగా 6-8 గంటలపాటు మూత్రాన్ని పట్టుకోగలరు. కానీ అంతసేపు బిగబట్టి ఉండడం అస్సలు మంచిదికాదంటున్నారు వైద్యులు.

మూత్రాశయ కండరాలపై ప్రభావం

మీ మూత్రాశయ కండరాలు చాలా బలంగా ఉంటాయి, కానీ మీరు వాటిపై ఎక్కువ ఒత్తిడిని పెడితే, అవి బలహీనంగా మూత్ర నియంత్రణ క్రమంగా తగ్గుతుంది. మూత్రం లీకేజ్ సమస్య పెరుగుతుంది. ఎక్కువసేపు మూత్రాన్ని పట్టుకున్నప్పుడు పెల్విక్ నొప్పి (పొత్తికడుపు) పెరుగుతుంది. ఇది పెల్విక్ క్రాంప్‌లకు కూడా దారి తీస్తుంది.

UTI ప్రమాదం

మూత్రాశయాన్ని ఖాళీ చేయకపోవడం వల్ల మరొక సమస్య అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రాన్ని ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.

కిడ్నీ స్టోన్ సమస్య

మూత్రంలో ఉండే మినరల్ కంటెంట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తుంది. దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్ అవడం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, రాత్రిళ్లు మధ్యలో లేవడం, ఇవన్నీ మరీ ఇబ్బంది పెట్టే అంశాలుగా మారితే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.

మూత్రం ఆరోగ్యం ఇతర సమస్యల గురించి కూడా చెబుతుంది. మీరు అలాంటి సమస్యను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సమస్య పెద్దదా లేదా చిన్నదా అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు.

Tags

Read MoreRead Less
Next Story