World Kidney Day : కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడడానికి కారణాలు..జాగ్రత్తలు

World Kidney Day : కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడడానికి కారణాలు..జాగ్రత్తలు
ఇటీవల తరచుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాము. మూత్రపిండంలో రాళ్లు మూత్రపిండ వైఫల్యానికి దారితీయవచ్చు.

ఇటీవల తరచుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాము. మూత్రపిండంలో రాళ్లు మూత్రపిండ వైఫల్యానికి దారితీయవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే దీనిని నివారించవచ్చు. కిడ్నీ వ్యాధి నివారణ, ముందస్తుగా గుర్తించడం, చికిత్స గురించి వ్యక్తులకు అవగాహన కల్పించడానికి ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. చివరికి ప్రపంచ స్థాయిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా , ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని బాధించే ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. కిడ్నీ సమస్య ప్రపంచ వ్యాప్తిలో భారతదేశం 12% వాటాను కలిగి ఉంది.

ఇది కిడ్నీ స్టోన్స్ గురించి , ఇది భారతదేశంలో చాలా సాధారణం మరియు ఉత్తర భారతదేశంలో చాలా సాధారణం. మూత్రపిండ రాళ్లు అని కూడా పిలువబడే కిడ్నీ స్టోన్స్, మూత్రంలో ఖనిజాలు, లవణాలు స్ఫటికీకరించినప్పుడు మూత్రపిండాలలో ఏర్పడే ఘన నిక్షేపాలు.

ఇవి తరచుగా బాధాకరంగా ఉంటాయి. మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తాయని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌లోని యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు.

కిడ్నీలో రాళ్లకు కారణమేమిటి?

"కిడ్నీలో రాళ్లకు అనేక రకాల కారణాలు ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ ఒక కారణాన్ని గుర్తించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు" అని డాక్టర్ కళ్యాణ్ బెనర్జీ క్లినిక్ సీనియర్ హోమియోపతి డాక్టర్ కుశాల్ బెనర్జీ చెప్పారు.

"అధిక బరువు ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, పదేపదే యూరినరీ ఇన్ఫెక్షన్లు, అధిక పోషకాహార సప్లిమెంట్లు తీసుకోవడం, ఎరేటెడ్ పానీయాల అధిక వినియోగం వంటివి కొన్ని కారణాలు. ఆస్పిరిన్ వంటి మందులు, కొన్ని యాంటాసిడ్లు, మూత్రవిసర్జన ( ద్రవాన్ని తొలగించే మందులు), కొన్ని యాంటీబయాటిక్స్, యాంటీ-ఎపిలెప్టిక్స్ కూడా మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్లు కుటుంబంలో పూర్వం ఎవరికైనా ఉన్నా ప్రమాదాన్ని పెంచుతుంది. విసర్జన వ్యవస్థకు సంబంధించి కొన్ని పుట్టుకతో వచ్చే వైకల్యాలు కూడా పెరుగుతాయి అని డాక్టర్ బెనర్జీ తెలిపారు.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన మూలికలు

కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి మరొక ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం. కిడ్నీలో రాళ్లకు సంబంధించిన ఆహారాలను తీసుకోవడం నివారించాలి. ప్యాక్ చేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం, ఎక్కువ ప్రొటీన్‌లు ఉన్న ఆహారం తీసుకోవడం మానేయాలి.

రోగికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే, పాలకూర, బెండకాయ, టొమాటోలు మొదలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. సప్లిమెంట్స్ మరియు 'ప్రోటీన్ షేక్స్' లాంటి సమ్మేళనాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. శారీరకంగా చురుకుగా ఉండటం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉన్నప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఊబకాయం, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రేరేపిస్తాయి

దీర్ఘకాలిక మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు, సిస్టిక్ కిడ్నీ వ్యాధులు, ప్రేగు వ్యాధులు అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలవు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఊబకాయం లేని వారితో పోలిస్తే ఊబకాయం (BMI>30) ఉన్న వ్యక్తులలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు వివరిస్తున్నారు.

పునరావృతమయ్యే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం ఏమిటి?

చికిత్స చేసినప్పటికీ చాలా మంది వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు పునరావృతమవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స పొందిన వారిలో 90% మందికి పైగా 20-25 ఏళ్లలోపు మరో రాయి ఏర్పడుతుంది.

దీని వెనుక గల కారణాలను డాక్టర్ కమల్ వివరించారు. " చికిత్స పూర్తిగా తీసుకోకపోవడం వల్ల అవశేష స్ఫటికాలు మూత్రపిండాల్లో ఉండిపోతాయి. దాంతో రాళ్లు పునరావృతం అవుతాయి. ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండటం, అదనపు ఉప్పు, చక్కెరలను నివారించడం, వ్యాయామం చేయడం ఇవన్నీ అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story