జ్వరం, విరోచనాలతో 130 మంది చిన్నారులు ఆస్పత్రిపాలు..
COVID-19 మహమ్మారి థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య ఉత్తర బెంగాల్‌లోని

COVID-19 మహమ్మారి థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన 130 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు.
తీవ్రమైన జ్వరం, విరోచనాలతో కనీసం 130 మంది పిల్లలు జల్పాయిగురి సదర్ ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. COVID-19 మహమ్మారి మూడవ వేవ్ పిల్లలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణుల హెచ్చరికల మధ్య చిన్నారులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా అందరికీ అత్యవసర చికిత్స అందుబాటులో ఉంటుంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని అధికారి మీడియాకి వివరించారు. అవసరమైతే, పిల్లలకు కోవిడ్ టెస్ట్ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.
RELATED STORIES
Sameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMTJR NTR Fans : జూబ్లీహిల్స్‌లోని ఎన్టీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి...
20 May 2022 4:30 AM GMTHBD NTR : మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్..!
20 May 2022 3:29 AM GMTMahesh Babu : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నాని..!
20 May 2022 2:00 AM GMT