Kozhikode: పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ.. 1800 కోళ్లు మృత్యువాత

Kozhikode: పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ.. 1800 కోళ్లు మృత్యువాత
Kozhikode: కోజికోడ్ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపించి 1800 కోళ్లు చనిపోయాయి.

Kozhikode: కోజికోడ్ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపించి 1800 కోళ్లు చనిపోయాయి. జిల్లా పంచాయతీ నిర్వహించే స్థానిక ఫారమ్‌లోని పౌల్ట్రీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో కనీసం 1,800 కోళ్లు ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయాయి.


ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని కేరళ పశుసంవర్ధక మంత్రి జె చించు రాణి ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పరీక్షల్లో బర్డ్ ఫ్లూ అని తేలడంతో, నమూనాలను భోపాల్ (మధ్యప్రదేశ్)లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపి, ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా అని నిర్ధారించారు. ఫారంలో 5,000 పైగా కోళ్లు ఉన్నాయి. వాటిలో 1,800 కోళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో మరణించాయి.

Tags

Read MoreRead Less
Next Story