దేశంలో కోత్తగా 2, 95,041 కేసులు.. 2,023 మృతి...!

దేశంలో కోత్తగా 2, 95,041 కేసులు.. 2,023 మృతి...!
ఏప్రిల్ నెల దేశాన్ని కకావికలం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 34 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

ఏప్రిల్ నెల దేశాన్ని కకావికలం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 34 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో చూస్తే 2 లక్షల 94 వేల కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు 3 లక్షలకు డైలీ కేసులు చేరువయ్యాయి. ఈ పరిస్థితి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. గతేడాది అమెరికాలో డైలీ కేసులు 3 లక్షల 7 వేలు నమోదయ్యాయి. ఆ స్థాయిలో ప్రపంచంలోనే ఒక్కరోజు కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు భారత్‌లోనే నమోదయ్యింది.

చూస్తుంటే ఇదే పరిస్థితి మరో వారం పదిరోజులు ఉండేలా కనిపిస్తోంది. ప్రధాని మోదీ సహా వైద్యులు, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తూన్నా.. ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం కారణంగా కేసులు లక్షలకు లక్షలు నమోదవుతున్నాయి. ఈసారి ఆక్సిజన్ కొరత కూడా ఎక్కువగా ఉంటుండడం, డబుల్ వేరియెంట్ వైరస్ ప్రమాదకరంగా మారి పేషెంట్ల ఆయువు తీస్తుండడంతో ఎటు చూసినా భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి.

24 గంటల్లో 2 లక్షల 94 కేసులే రికార్టు అంటే.. మరణాలు కూడా 2 వేలు దాటేయడం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఏ క్షణాన ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. నిన్న ఒక్కరోజే 2 వేల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల బంధువులు వారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసేందుకు శ్మశాన వాటికల్లో పడుతున్న బాధలు, కష్టాలు కూడా వర్ణనాతీతం.

దిగజారిపోయిన పరిస్థితులు చూస్తుంటే స్వీయ నియంత్రణ లేకపోతే ఎవరి ప్రాణాలకూ గ్యారెంటీ లేదనే కఠినమైన మాటలు చెప్పాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 28 వేల 395 కేసులు నమోదయ్యాయి. 277 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 519 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీయే ఉంది. అలాగే ఛత్తీస్‌గఢ్, యూపీ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ రోజువారీ మరణాల సంఖ్య 120 దాటేసిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరగడం, రోజువారీ కేసులు 3 లక్షలు దాటేసే సూచనలు కనిపిస్తుండడంతో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో మొత్తం 34 లక్షల కేసులు వస్తే ఈ వారం రోజుల్లోనే 17 లక్షల కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story