Blind Lovers: మా ప్రేమ గుడ్డిది కాదు..: బ్లైండ్ లవర్స్ లవ్ స్టోరీ

Blind Lovers: మా ప్రేమ గుడ్డిది కాదు..: బ్లైండ్ లవర్స్ లవ్ స్టోరీ
Blind Lovers: ఎవరైనా నన్నెందుకు ఇష్టపడతారు అని అనుకునేవాణ్ణి. కానీ దేవుడు నా కోసమే ఆర్తిని సృష్టించాడేమో అని అనుకున్నాను..

Blind Lovers: అతడేంటి ఇలా ఉన్నాడు.. ఆమేంటి అలా ఉంది.. ఇద్దరికీ ఎలా కుదిరిందో.. ప్రేమించుకోవడం ఏంటో.. పెళ్లి చేసుకోవడం ఏంటో.. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు.. ఈడు జోడు సరిగా లేని జంటలని చూస్తే ఇలాంటి మాటలే వస్తాయి సమాజం నుంచి.. ఎవరికి ఎవరో ముందే రాసి పెట్టి ఉంటుంది.. మనం ఎన్ని అనుకున్నా వాళ్లతోనే జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుంది. అందుకేనేమో వాళ్లిద్దరూ ఆన్‌లైన్‌లో మూడేళ్ల క్రితమే కలిసారు.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేరు.. కానీ ఇద్దరి మనసుల్లో ఏముందో ఒకరికొకరు చెప్పుకోగలరు.. అదే వారిద్దరినీ దగ్గర చేసింది.

ఆర్తితో ఫోన్ మాట్లాడుతుంటే సమయమే తెలియదంటాడు దీపక్.. మేమిద్దరం సాయింత్రం గంటల తరబడి మాట్లాడుకుంటాము. నేను ఆమెను నవ్విస్తాను.. ఆమె నాకోసం పాట పాడుతుంది. నేను గుడ్డి వాడిని కావడం వల్ల ఎవరైనా నన్నెందుకు ఇష్టపడతారు అని అనుకునేవాణ్ణి. కానీ దేవుడు నా కోసమే ఆర్తిని సృష్టించాడేమో అని అనుకున్నాను.. ఆమెతో మాట్లాడిన మొదటిసారి. నా నిరాశ, నిస్పృహలను పారద్రోలింది.. నా జీవితంలో వెలుగులు నింపింది ఆర్తి. నువు కాలేజీలో చదువుతున్నావు.. చూడగలిగే వాళ్లు చేసే పనులన్నీ చేస్తున్నావు.. అని నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంటుంది. అనతికాలంలోనే ఆమె నాకు స్ఫూర్తిగా నిలిచింది.

మేమిద్దరం జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాము. ఆమె మొదల తన ప్రేమను వ్యక్తం చేసింది.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ మాటకు ఓ క్షణం పాటు నా ఊపిరి ఆగిపోయినట్లనిపించింది.. నేను కూడా ఆ సమయంలో అదే అనుభూతికి లోనయ్యాను.. మొదటిసారి కలుసుకోవాలనుకున్నాము. ఆమె కోసం ఢిల్లీ వెళ్లాను. ఆమె నాకోసం పువ్వులు తెచ్చింది. ఆమె చేయిపట్టుకున్నప్పుడు షాక్‌లాగా అనిపించింది. ఎన్నో జన్మల బంధం ఇది అనిపించింది. ఒక పార్కులో కూర్చుని పొద్దుపొడిచే వరకు మాట్లాడుకున్నాము.

ఆమె నన్ను స్టేషన్ వద్ద దింపింది. మేము మళ్ళీ కలవాలని ప్లాన్ చేసాము. మా ఇద్దరినీ చూసిన అపరిచితులు పర్ఫెక్ట్ జోడీ అంటే ఆనందంగా ఉంటుంది. నేను ఆర్తితో ఎప్పుడూ చెబుతుంటాను, 'నేను నిన్ను చూడలేను, కానీ నీకు చాలా అందమైన మనసు ఉంది' దానిని నేను చూశాను అని అన్నప్పుడు ఆమె నవ్వుతుంది.. దాని కోసమే నేను జీవిస్తున్నాను.

మా గురించి మా తల్లిదండ్రులకు ఇంకా చెప్పలేదు. మేము వేర్వేరు కులాలకు చెందినవాళ్లం. వాళ్లని ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది, కానీ మా ప్రేమను చూసి వారు అంగీకరిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఆర్తి, నేను ఇప్పుడు 3 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాము. టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో ఆమే నాకు నేర్పింది. నేను కాలేజీలో చదువుకోవడానికి సహాయం చేసింది; నేను ఇప్పుడు స్కూల్లో పనిచేస్తున్నాను. ఆర్తీ కాలేజీ చదువు పూర్తి చేసి, పని ప్రారంభించే సమయానికి, నేను ఆమెకు ఒక ఉంగరం కొనడానికి సరిపోయేంత డబ్బుని పొదుపు చేయాలనుకుంటున్నాను. ఎంతో కొంత సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకోమని అడగగలను.

3 సంవత్సరాల క్రితం, నా జీవితం బ్లాక్ అండ్ వైట్ చిత్రంలా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. నా జీవితంలో ఇన్ని రంగులు కేవలం ఒక వ్యక్తి నుండి మాత్రమే వచ్చాయని కచ్చితంగా చెప్పగలను. ఆర్తి - నా జీవితంలోకి వచ్చిన ఓ వెలుగు అని చెబుతాడు దీపక్ ఆనందంగా. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దీపక్ సోషల్ మీడియాతో పంచుకున్న లవ్ స్టోరీ.

Tags

Read MoreRead Less
Next Story