జాతీయం

India Corona cases : భారత్‌లో కొత్తగా 44,111 కేసులు, 738 మరణాలు..!

India Corona cases : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి.

India Corona cases : భారత్‌లో కొత్తగా 44,111 కేసులు, 738 మరణాలు..!
X

India Corona cases : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44వేల 111 కేసులు నమోదవగా.. కొవిడ్‌తో 738 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా నిత్యం 50వేలకు పైగానే ఉంది. 95 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షలకు దిగువకు చేరాయి. గత 24గంటల్లో 57వేల 477 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4లక్షల 95వేల 553 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 3 కోట్ల 5 లక్షలు నమోదయ్యాయి. కొవిడ్‌ మహమ్మారితో 4 లక్షల ఒక వెయ్యి మంది మృత్యువాతపడ్డారు. దీంతో రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగిందని.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అటు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల 46 లక్షల టీకా డోసులు పంపిణీ చేశారు.

Next Story

RELATED STORIES