భారత్‌లో ఆరు స్ట్రెయిన్ వైరస్ కేసులు!

భారత్‌లో ఆరు స్ట్రెయిన్ వైరస్ కేసులు!
బ్రిటన్ వేరియంట్ వైరస్.. స్ట్రెయిన్‌ భారత్‌లోకి కూడా చొచ్చుకొచ్చింది. భారత్‌లో ఆరు స్ట్రెయిన్ వైరస్ కేసులు బయటపడినట్టు సీసీఎంబీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇందులో వరంగల్‌ వాసి కూడా ఒకరు ఉన్నారు.

బ్రిటన్ వేరియంట్ వైరస్.. స్ట్రెయిన్‌ భారత్‌లోకి కూడా చొచ్చుకొచ్చింది. భారత్‌లో ఆరు స్ట్రెయిన్ వైరస్ కేసులు బయటపడినట్టు సీసీఎంబీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇందులో వరంగల్‌ వాసి కూడా ఒకరు ఉన్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేసిన ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసింది. వారిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష జరిపారు. ఈ పరీక్షల్లో స్ట్రెయిన్ వైరస్ బయటపడింది.

బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ టెస్ట్ తప్పనిసరి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ నుంచి గాని, బ్రిటన్ మీదుగా గాని ఇండియాకి ఎవరైనా వస్తే వారందరికీ జీనోమ్ పరీక్ష చేయాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. స్ట్రెయిన్ వైరస్ గుర్తించిన వారి కుటుంబ సభ్యులకు కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. జీనోమ్ టెస్ట్ కోసం దేశవ్యాప్తంగా పది ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం స్ట్రెయిన్ వైరస్ గుర్తించిన వారి కోట్రావెలర్స్‌ను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. స్ట్రెయిన్ వైరస్‌ వ్యక్తులతో కలిసి ప్రయాణం చేసిన వారిని, ఇండియాలో ఎవరెవరిని కలిశారో వారందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. స్ట్రెయిన్ వైరస్ వచ్చిన ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ రూమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి. స్ట్రెయిన్ వైరస్‌కు కూడా కరోనా ట్రీట్‌మెంట్‌నే అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. దేశంలో స్ట్రెయిన్ వ్యాప్తిపై సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రెస్‌మీట్ పెట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story