GST: కొత్త ఏడాదిలో బాదుడే బాదుడు.. జనవరి 1 నుంచి వీటి ధరలు..

GST: కొత్త ఏడాదిలో బాదుడే బాదుడు.. జనవరి 1 నుంచి వీటి ధరలు..
GST: ఈ కొత్త నిబంధనతో ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి.

GST: జీఎస్టీలో మార్పులతో 2022 జనవరి నుంచి నూతన ధరలు అమల్లోకి రానున్నాయి.

అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులపై రూ.1000 లోపు MRP ఉంటే 5%, రూ.1000 పైనే ఉంటే 12% జీఎస్టీ విధిస్తారు.

రేట్లతో సంబంధం లేకుండా అన్ని రకాల ఫుట్‌వేర్లపై 12% జీఎస్టీ వసూలు చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఆటోబుక్ చేసుకుంటే కూడా జీఎస్టీ కట్టాల్సిందే. నేరుగా ఆటోబుక్ చేసుకుంటే మాత్రం జీఎస్టీ ఉండదు.

స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపైనా 5% జీఎస్టీ విధిస్తారు. అయితే ఇది కస్టమర్లకు వర్తించదు.. కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ కొత్త నిబంధనతో ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నిర్ణయం వినియోగదారుడిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.

పన్ను చెల్లింపు దారులు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటే కొత్త సంవత్సరం నుంచి ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి.

ఆయా సంస్థలు రిటర్న్ దాఖలు చేసే సమయంలో జీఎస్టీకి సంబంధించిన ఫారాల్లో ఏమైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ముందస్తు నోటీసులు లేకుండా నేరుగా అధికారులను పంపే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కొత్త నిబంధన కూడా నూతన సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.

Tags

Read MoreRead Less
Next Story