గ్రేట్ : నిజాయితీ చాటుకున్న పారిశుద్ధ్య కార్మికుడు

గ్రేట్ : నిజాయితీ చాటుకున్న పారిశుద్ధ్య కార్మికుడు
చెత్తలో దొరికిన రూ.15వేలను, పొగొట్టుకున్నవారికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

చెత్తలో దొరికిన రూ.15వేలను, పొగొట్టుకున్నవారికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైలో మూర్తి అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు బీసెంట్‌నగర్‌లో బ్యాటరీ వాహనంలో చెత్తను సేకరిస్తుండగా అందులో ఓ పార్శిల్ కనిపించింది. ఆ పార్శిల్ ను విప్పి చూస్తే.. అందులో రూ.15వేలు ఉన్నాయి. వెంటనే మూర్తి కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం వార్డు మేనేజర్‌ సెల్వంకు విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత అధికారి సెల్వంతో కలిసి నగదును పార్శిల్ పడేసిన ఇంటి యజమానికి అప్పగించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు మూర్తిని అభినందించి మూర్తి నిజాయితీకి బహుమతిగా రూ.5వేలు అందజేశారు. మైలాపూర్‌ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నటరాజన్‌ గురువారం మూర్తిని అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story