Vikram Agnihotri: కాలితో కారు డ్రైవింగ్.. సెల్యూట్ చేసిన ఆనంద్ మహీంద్రా

Vikram Agnihotri: కాలితో కారు డ్రైవింగ్.. సెల్యూట్ చేసిన ఆనంద్ మహీంద్రా
Vikram Agnihotri: అన్ని అవయవాలు ఉన్నా అదృష్టం లేదేమో అందుకే నేను ఆ పనిలో విజయం సాధించలేకపోయాను అని మనల్ని మనం తప్పుగా అంచనా వేసుకుంటాము.

Vikram Agnihotri: అన్ని అవయవాలు ఉన్నా అదృష్టం లేదేమో అందుకే నేను ఆ పనిలో విజయం సాధించలేకపోయాను అని మనల్ని మనం తప్పుగా అంచనా వేసుకుంటాము. కానీ నీ వంతు ప్రయత్నంగా నూటికి నూరు శాతం కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుంది.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది అంటారు వివేక్ అగ్నిహోత్రి. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం వివేక్ కి సెల్యూట్ చేస్తున్నారు..

మహీంద్రా గ్రూప్ సీఈఓ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అందులో విక్రమ్.. మీరు మా కారును డ్రైవ్ చేస్తే మా అదృష్టంగా భావిస్తాము అని పేర్కొన్నారు.

మహీంద్రా & మహీంద్రా కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రా యొక్క ట్విట్టర్ ఖాతా నుండి వచ్చిన ఇటువంటి పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా మరొక స్ఫూర్తిదాయక వీడియోను పంచుకున్నారు.

శనివారం ఉదయం ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి చేతులు లేకుండా కారు నడుపుతున్నాడు. నిజానికి ఈ వ్యక్తి వికలాంగుడు. అతనికి రెండు చేతులు లేవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు విక్రమ్ అగ్నిహోత్రి.

విద్యుదాఘాతం కారణంగా విక్రమ్ తన రెండు చేతులను కోల్పోయాడు. అయినా పట్టు వదలని విక్రమ్ తన కాళ్ల ద్వారా డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాలిద్వారా కారు నడపడానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా పొందాడు.

ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ఈ వ్యక్తి తన వాహనాలను నడపాలని కోరుకుంటున్నారు. ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంటూ, విక్రమ్ మా కారును డ్రైవ్ చేస్తే, అది తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని, అదృష్టంగా భావిస్తానని రాశారు.

సమాజాన్ని ప్రేరేపించే వ్యక్తులకు సహాయం చేయడానికి ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. అంతకుముందు, పారా-అథ్లెట్ దీపా మాలిక్ టోక్యో పారాలింపిక్స్ 2020లో పతకం సాధించింది. ఆమె సాధించిన విజయానికిగాను ఆనంద్ వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని బహుకరించారు.

వికలాంగులు కూడా కార్లు నడపడానికి వీలుగా అలాంటి వాహనాలను తయారు చేయాలని దీపా మాలిక్ ఆటో తయారీదారులకు ట్వీట్ చేసి అభ్యర్థించారు. ఈ క్రమంలో, ఆనంద్ మహీంద్రా దానిని తయారు చేయమని తన బృందానికి సవాలు విసిరారు. చివరకు ఆయన కోరిక ఫలించింది. మహీంద్రా కంపెనీ వారు వికలాంగుల కోసం ప్రత్యేక వాహనం తయారు చేశారు. అది దీపకు బహుమతిగా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.

కాగా, మహీంద్రా భారతదేశంలో తన కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్ కోసం సిద్ధమవుతోంది. జూన్ 27న దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ వాహనం బిగ్ డాడీగా ప్రచారం పొదుతోంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ మరియు 2.2-లీటర్ డీజిల్ యూనిట్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story