ముదురుతున్న ఆంధ్రా, ఒడిశా సరిహద్దు వివాదం

ముదురుతున్న ఆంధ్రా, ఒడిశా సరిహద్దు వివాదం
Andhra pradesh and Odisha: ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది.

ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని 23 కోటియా గ్రూప్‌ ఆఫ్‌ విలేజెస్‌‌పై ఒడిశా పెత్తనం చెలాయిస్తోంది. ఆ గ్రామాలన్నీ తమవేనంటూ వితండవాదం చేస్తున్న ఒడిశా.. ఆంధ్రా అధికారులు రాకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలతో దడి కట్టింది. నిన్న వందల మంది పోలీసులను మోహరించిన ఒడిశా.. ఇవాళ కూడా పోలీసుల గస్తీ కొనసాగిస్తోంది. 23 గ్రామాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించింది. 23 గ్రామాల్లోని ప్రజలను బయటకు రాకుండా ఒడిశా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. ఆంధ్రా పోలీసులు లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లడానికి ఆంధ్రా అధికారులు, ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు.


Tags

Read MoreRead Less
Next Story