ఈ చీర చాలా టేస్టీ.. కట్టుకోవచ్చు.. తినేయొచ్చు

ఈ చీర చాలా టేస్టీ.. కట్టుకోవచ్చు.. తినేయొచ్చు
సెల్ బయాలజీ టెక్నిక్‌ను చీర తయారీలో ఉపయోగించింది. కేరళ సంప్రదాయాన్ని విస్మరించుండా బంగాళ దుంప, బియ్యప్పిండి కలిపి 100

అగ్గిపెట్టెలో చీర, అరచేతిలో చీర తెలుసు కానీ ఇలా తినే చీరలు కూడా తయారు చేస్తారని ఇప్పుడే వింటున్నాము. ఆలోచనకు అభిరుచి తోడైతే కొత్త కొత్త ప్రయోగాలు ఎన్నైనా చేయొచ్చు. అది అందరికీ నచ్చితే మరింత ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రేరణ అవుతుంది. కేరళ కొల్లామ్‌కు చెందిన అన్నా ఎలిజబెత్ జార్జ్.. క్యాన్సర్ అండ్ న్యూరో బయాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది.

చదువుకుంటూనే తనకు ఇష్టమైన బేకరీ ఐటెంస్‌ను ఇంట్లోనే తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతుంది. కేరళీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఓనం పండుగకు తానే ఓ చీరను వినూత్నంగా రూపొందించాలనుకుంది అన్నా. తాను పీహెచ్‌డీ చేస్తున్న సెల్ బయాలజీ టెక్నిక్‌ను చీర తయారీలో ఉపయోగించింది.

కేరళ సంప్రదాయాన్ని విస్మరించకుండా బంగాళ దుంప, బియ్యప్పిండి కలిపి 100 ఏ ఫోర్ సైజ్ వేఫర్లను రూపొందించింది. వీటన్నింటినీ కలిపి 18 అడుగుల చీర తయారు చేసింది. బోర్డర్ కోసం గోల్డ్ లస్టర్‌ను వాడింది. ఈ చీర తయారీకి వారం రోజులు పట్టిందట. దాదాపు రూ.30 వేలు ఖర్చయింది.

2 కేజీల బరువున్న ఈ చీరను కట్టుకుని తింటున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్స్ తమకూ అలాంటి చీర తయారుచేసి ఇవ్వమంటూ పోస్టులు పెడుతున్నారు. సమయం దొరికితే ఇంకా తక్కువ ఖర్చుతో తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తానంటోంది అన్నా.

Tags

Read MoreRead Less
Next Story