Parrot: పక్కింటోళ్ల చిలుక పడుకోనివ్వట్లేదు.. 72 ఏళ్ల వృద్ధుడు పోలీస్ కంప్లైంట్

Parrot: పక్కింటోళ్ల చిలుక పడుకోనివ్వట్లేదు.. 72 ఏళ్ల వృద్ధుడు పోలీస్ కంప్లైంట్
Parrot: చిట్టి చిలుక అరుపులు కూడా ఆయనకు చిరాకు పెట్టించాయి. దాంతో 72 ఏళ్ల ఆ ముసలాయన ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు.

Parrot: పిల్లల అల్లరో, పెట్ డాగ్ అరుపులో అయితే పక్కింటోళ్లకి బాగా డిస్ట్రబ్ అవుతుంటుంది.. సహజంగానే విసుగు, చిరాకు మొదలవుతుంది.. కానీ ఇక్కడ చిట్టి చిలుక అరుపులు కూడా ఆయనకు చిరాకు పెట్టించాయి. దాంతో 72 ఏళ్ల ఆ ముసలాయన ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కాసేపు కూడా పడుకోనివ్వట్లేదు.. అస్తమాను కీచు కీచుమంటూ ఒకటే గోల.. మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని.

పూణేకు చెందిన సురేశ్ షిండే తన పొరుగున ఉన్న అక్బర్ అమ్జాద్ ఖాన్‌పై ఆగస్టు 5న ఖడ్కీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే అతని చిలుక నిరంతరం అరుస్తోంది అని. ఇది సీనియర్ సిటిజన్‌ను కలవరపెడుతోందని అధికారి తెలిపారు.

హౌసింగ్ కాంప్లెక్స్ నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలో సురేశ్ నివసిస్తున్నారు. ప్రేమతో పెంచుకుంటున్నాం అనుకుంటారు కానీ ఒక్కోసారి అవి పక్కవాళ్లను ఇబ్బంది పెడుతుంటాయి. హాయిగా అడవుల్లో, ఆకాశంలో విహరించే చిలుకల్ని తీసుకొచ్చి పంజరంలో బంధిస్తే అవి అరవక ఏం చేస్తాయి. మన ఆనందం కోసం తెచ్చి పెంచుకుంటాం కానీ వాటి స్వతంత్రను హరిస్తున్నామని ఆలోచించం. ఈ గోల భరించలేక పోతున్నాం.. ఏం చేయాలో చెప్పండి అని పెద్దాయన పోలీసులతో మొరపెట్టుకున్నారు.

"షిండే ఫిర్యాదుతో చిలుక యజమానిపై కేసు నమోదు చేశాము. విచారణ కొనసాగిస్తాము అని ఖడ్కీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story