Anupam Kher: శభాష్ అనుపమ్ ఖేర్.. నేపాల్‌లో భిక్షాటన చేస్తున్న బాలికను..

Anupam Kher: శభాష్ అనుపమ్ ఖేర్.. నేపాల్‌లో భిక్షాటన చేస్తున్న బాలికను..
Anupam Kher: విధిరాత సరిగా లేని చిన్నారులు వీధుల్లో అడుక్కుంటూ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తున్నారు..

Anupam Kher: కొన్ని విషయాలు కొంతమందిని కదిలిస్తుంటాయి. అవకాశం వచ్చినప్పుడు సాయం చేసేందుకు ఆస్కారం కల్పిస్తాయి. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఎంతో మంది అభిమానుల మనసు చూరగొన్నాడు.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. వయసు మీద పడడంతో సినిమాలకు కాస్త విరామం తీసుకున్నాడు.. విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే నేపాల్ దేశ అందాలను వీక్షించేందుకు అక్కడికి వెళ్లాడు. అక్కడి ఓ దేవాలయాన్ని సందర్శిస్తున్న సమయంలో ఆర్తి అనే ఓ చిన్నారి భిక్షాటన చేస్తూ కనిపించింది. అనుపమ్ ఖేర్ ఆమెను కదిలించగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల ద్వారా ఎక్కువ చదువుకోలేదని, ఎవరూ లేరని తెలుసుకున్నాడు .. మట్టిలో మాణిక్యానికి మెరుగు పెట్టాలనుకున్నాడు..

అనుకున్నదే తడవుగా ఆర్తిని ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని, ఆమెను ప్రయోజకురాలిని చేసే బాధ్యత తనది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. విధిరాత సరిగా లేని చిన్నారులు వీధుల్లో అడుక్కుంటూ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తున్నారు.. పెద్ద మనసున్న ఇలాంటి హీరోలు కొంత ముందుకొస్తే కనీసం పేదరికాన్ని కొంతైన నిర్మూలించగలుగుతాం..

ప్రతిభ ఉన్న చిన్నారులు బడిబాట పడితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని నెటిజన్లు అనుపమ్ ఖేర్‌ని ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి పనుల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు.. రీల్ హీరో కాదు.. రియల్ హీరో అని తమ గుండెల్లో పెట్టుకుంటారు.

కాగా, అనుపమ్ ఖేర్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న 'కార్తికేయ 2' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story