Madhu Khoiwal: 50 ఏళ్ల వయసులో బడికి వెళ్లి.. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉద్యోగం సంపాదించి..

Madhu Khoiwal: 50 ఏళ్ల వయసులో బడికి వెళ్లి.. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉద్యోగం సంపాదించి..
Madhu Khoiwal: సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ, వయసుతో పనేముంది. చదువుకునేందుకు వయసు అస్సలు అడ్డంకి కాదు అని నిరూపించింది మధు ఖోయ్వాల్.

Madhu Khoiwal: సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ, వయసుతో పనేముంది. చదువుకునేందుకు వయసు అస్సలు అడ్డంకి కాదు అని నిరూపించింది మధు ఖోయ్వాల్. అదే ఈ రోజు ఆమెను UN ఉమెన్స్ కంట్రీ ఆఫీస్‌లో జరిగిన IWD 2023 యొక్క ఇండియా స్మారకోత్సవంలో ప్రసంగించేలా చేసింది.

మధు ఖోయ్వాల్ జర్నీ

మధు ఖోయ్వాల్ రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందినవారు. చాలా మంది అమ్మాయిల మాదిరిగానే, చదువుకోని లేదా మధ్యలోనే వదిలేసిన రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన మధు మధు కథ కూడా అందుకు భిన్నంగా లేదు. అనేక కారణాల వల్ల ఆమె 5వ తరగతిలో ఉన్నప్పుడే చదువు మానేసింది. ఆడపిల్లలకు అంతకంటే చదువెందుకు అనే వాళ్లే కానీ, చదువుకోమని ప్రోత్సహించిన వారు లేరు. దానికి తోడు ఇంటి నుంచి బడి కూడా చాలా దూరం. నాలాగే చాలా మంది అమ్మాయిలూ ఇదే కారణంతో చదువును మధ్యలోనే వదిలేశారు అని తన గతాన్ని గుర్తు చేసుకుంది మధు.

చిన్నతనంలో చదువును వదిలిపెట్టిన మధుకు చదువుకోవాలనే కోరిక మాత్రం తీరలేదు.. మళ్లీ చదువుకుంటాను అని చెబితే భర్త నిరుత్సాహపరిచాడు. భర్తకు, పిల్లలకు సపర్యలు చేస్తూ కుటుంబ జీవితాన్ని వెళ్లదీస్తుండేది.

ఉద్యోగం చేసే మహిళగా జీవితం ఎలా మారిపోయింది

తన జీవిత గమనాన్ని మార్చింది తన పిల్లలే అని ఆనందంగా చెబుతుంది మధు. అమ్మకు ఇష్టమున్నా చదువుకోలేకపోయిన విషయాన్ని గుర్తించారు. చదువుకోమని ప్రోత్సహించారు.. పెళ్లైన ముఫ్పైఏళ్ల తరువాత బడికి వెళుతున్న ఆమెను చూసి ఇరుగు పొరుగు వారు ముక్కు మీద వేలేసుకున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బడికి వెళ్లింది. బాగా చదువుకుంది. 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఏదైనా నేర్చుకోవడం ఎంత ముఖ్యమో నేను గ్రహించాను." మంజరి ఫౌండేషన్ సహాయంతో, LIC ఏజెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ వాటిని తాను చేస్తున్న ఉద్యోగానికి వర్తింపచేసేది.

విజయానికి సమయపాలన లేదు

50 ఏళ్ళ వయసులో తన జీవితాన్ని మార్చుకున్న మధు తన వయసులో ఉన్న మహిళలకు ఉత్తమమైన సలహాలు ఇచ్చింది. “ఒక నిర్దిష్ట వయస్సులో మాత్రమే ఏదైనా చేయగలమనే ఆలోచన పూర్తిగా తప్పు అని నేను భావిస్తున్నాను. మనం జీవితంలో ఏ దశలో ఉన్నా ఏదైనా అభిరుచిని, ఏదైనా పనిని ఎంచుకోవచ్చు. దానిని కొనసాగించాలనే దృఢ సంకల్పం ఉంటే చాలు. ఈ వయస్సులో ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్న నేను మీకు గొప్ప ఉదాహరణ అని అతిధుల హర్షద్వానాల మధ్య మధు చెప్పింది.

ఇప్పుడు తన ప్రాంతంలో స్త్రీల విద్య కోసం వాదిస్తున్న వ్యక్తిగా మధు నిలుస్తోంది. ఏ స్త్రీకి కూడా చదువుకు దూరం కాకూడదని మధు ఆకాంక్షిస్తోంది. అలాంటి దేశం కోసం నేను ఆశిస్తున్నాను. విద్య ఎలా అద్భుతాలు చేస్తుందో నేను అర్థం చేసుకున్నాను. మహిళలందరూ తగినంత సామర్థ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను, అందువల్ల వారు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story