అధికారులు మా చెప్పులు మోయడానికే పనికొస్తారు: ఉమాభారతి షాకింగ్ కామెంట్స్

అధికారులు మా చెప్పులు మోయడానికే పనికొస్తారు: ఉమాభారతి షాకింగ్ కామెంట్స్
ఉమాభారతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని లేపడంతో ఆమె క్షమాపణలు కోరారు.

బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మరోసారి నోరు జారారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆమె ఈ సారి అధికారులు తమ చెప్పులు మోయడానికి తప్ప ఎందుకూ పనిరారని వ్యాఖ్యానించారు. కులాల ఆధారంగా జనగణన చేయాలన్న డిమాండ్‌తో తనను కలిసిన స్థానిక ఓబీసీ నాయకుల బృందంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమాభారతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని లేపడంతో ఆమె క్షమాపణలు కోరారు.

నాయకులు.. అధికారులు చెప్పినట్లు వింటారనుకుంటున్నారా.. అలా ఏం ఉండదు.. ముందు మేం చర్చించుకున్నాక వాళ్లు ఫైల్ సిద్ధం చేస్తారు. వాళ్లు మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటి.. పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న నన్నడిగితే పోస్టింగులు, జీతాలు ఇచ్చేది, ప్రమోషన్లు, డిమోషన్లను ఇచ్చేది కూడా మేమే. వాళ్లేం చేస్తారు.. మా చెప్పులు మోయడానికి మాత్రమే వాళ్లను అనుమతిస్తాం.. నిజం ఏంటంటే మా రాజకీయాలకు మేమే వాళ్లను వాడుకుంటాం అని వ్యాఖ్యానించారు.

ఉమా భారతి వ్యాఖ్యలకు ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ముఖ్యమంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ స్పష్టత ఇవ్వాలి అని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా డిమాండ్ చేశారు. కాగా, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ఉమా భారతి క్షమాపణలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story