Top

టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఫైనాన్స్‌ సోర్స్‌గా మారింది: తరుణ్‌ చుగ్‌

టీఆర్‌ఎస్‌ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌. టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఫైనాన్స్‌ సోర్స్‌గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు.

టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఫైనాన్స్‌ సోర్స్‌గా మారింది: తరుణ్‌ చుగ్‌
X

టీఆర్‌ఎస్‌ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌. టీఆర్‌ఎస్‌కు సింగరేణి ఫైనాన్స్‌ సోర్స్‌గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు కమీషన్ల నియామకాలుగా మారాయన్నారు. కవిత యూనియన్ లీడర్ గా అంతా తన చేతుల్లో పెట్టుకొన్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన ఆయన.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌పూర్‌లో సింగరేణి కార్మికులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై సీబీఐ విచారణ కోరుతామన్నారు. దోపీడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదలదంటూ.. పరోక్షంగా టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు తరుణ్‌ చుగ్‌.


Next Story

RELATED STORIES