Black Fungus: 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు..!

Black Fungus:  5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు..!
Black Fungus: దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

Black Fungus: దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వీరిలో 4,556 మందికి కరోనా చరిత్ర ఉందని, 55% మంది రోగులకు మధుమేహ వ్యాధి ఉందన్నారు. కోవిడిపై మంత్రులతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, స్టెరాయిడ్లు అధికంగా వాడిన వారికి బ్లాగ్ ఫంగస్ సోకే ప్రమాదముందన్నారు. అవయవ మార్పిడి జరిగిన వారికి, ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువ అని తెలిపారు. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ సైనస్‌కు, ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని, కొవిడ్ రెండో దశలో ఈ తరహా కేసులు పెరుగుతుండటం సవాలుగా మారిందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story