Aligarh: నాలుగేళ్ల చిన్నారిపైకి దూకిన ఎద్దు.. పాప పరిస్థితి విషమం

Aligarh: నాలుగేళ్ల చిన్నారిపైకి దూకిన ఎద్దు.. పాప పరిస్థితి విషమం
Aligarh: జంతువులు మనుషులపై దాడి చేయడం ఈ మద్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటోంది.

Aligarh: జంతువులు మనుషులపై దాడి చేయడం ఈ మద్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటోంది. కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పవడం కలచి వేసింది. ఆ ఘటన మరువకముందే మరో విషాదం చోటు చేసుకుంది. అలీగఢ్‌లో రోడ్డు మీద నిల్చుని ఉన్న 4 ఏళ్ల చిన్నారి మీదకు ఎద్దు దూకి తొక్కేసింది. దీంతో పాప పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన థానా గాంధీ పార్క్ ప్రాంతంలోని ధనిపూర్ మండిలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ఒక్కతే రోడ్డు మీద నిలబడి దిక్కులు చూస్తోంది. పాపకు సంబంధించిన వారు చుట్టు పక్కల ఎవరూ లేరు. ఎక్కడి నుంచో వచ్చిన ఎద్దు పరుగున వచ్చి పాప మీద పడింది. దాంతో చిన్నారికి ఊపిరి ఆడలేదు. అంతలోనే పరిగెత్తుకుంటూ పాపకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆమెను ఎద్దు బారి నుంచి రక్షించారు. గాయాలపాలైన చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఓ ఎద్దు చిన్నారిని తొక్కేస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్‌ బృందం ఎద్దును పట్టుకునేందుకు యత్నిస్తోంది. అనేక ఎద్దులు యథేచ్ఛగా సంచరిస్తుండటంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

https://www.indiatoday.in/?jwsource=cl

Tags

Read MoreRead Less
Next Story