అరే బాబు.. మా దేశంలో అమ్మాయిలు దొరకట్లేదురా పెళ్లి చేసుకుందామంటే..

అరే బాబు.. మా దేశంలో అమ్మాయిలు దొరకట్లేదురా పెళ్లి చేసుకుందామంటే..
ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది..

ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. అమ్మాయిలు దొరకట్లేదని ఆ దేశ వాసులు వాపోతున్నారు.

పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదేంటి అని బాధపడే అబ్బాయిలని మనం చాలా మందినే చూసుంటాం కదా. మన ఇంటి చుట్టుపక్కలే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లోని అబ్బాయిల పరిస్థితి ఇలాగే ఉందట.. ఆ దేశాలేంటో చూద్దామా..

పెళ్ళికోసం అమ్మాయిలు దొరకని దేశాల్లో గల్ఫ్ కంట్రీ ఖతర్‌ ముందు వరుసలో ఉంది. ఇక్కడి పురుషులు తమ వధువును వెతుక్కోవడం కోసం చాలా కష్టపడుతున్నారట. ఖతర్‌ లో ఆడవాళ్ళ సంఖ్య.. ఆ దేశ మొత్తం పురుషుల జనాభాలో 25% మాత్రమే ఉందట. పురుషుల సంఖ్య 1,99,25,084. అంటే.. ఖతర్‌లో ప్రతి 3 మంది మగవారికి ఒక స్త్రీమాత్రమే ఉందట. ఇక్కడి చాలా మంది పురుషులు అమ్మయిలు దొరకక బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారట పాపం.

రెండవ స్థానంలో UAE.. 20 వ శతాబ్దంలో యుఎఇ దేశ మొత్తం జనాభా 40,000. అందులో ఆడవారి సంఖ్య 22,000. అంటే.. దాదాపు మగవారి సంఖ్యలో సగం అన్నమాట. అక్కడి పెట్రోల్ వ్యాపారం ఊపు అందుకున్న తరువాత.. మెల్ల మెల్లగా దేశ జనాభా పెరుగుతూ వచ్చింది. దేశంలోకి చాలా మంది ఫారెనర్లు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఫలితంగా ఈ దేశంలో బ్రహ్మచారిణుల సంఖ్య చాలా తక్కువైంది. దీంతో ఇక్కడి అబ్బాయిలకి పెళ్లిచేసుకోవడానికి పిల్ల దొరకడం కష్టమైపోయింది.

మూడో స్థానంలో మన INDIA.. భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలను ఇప్పటికీ ఒక వంటింటి మనిషిగానే చూస్తారు. మహిళలు సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతునే ఉన్నారు. అనేక గ్రామీణ ప్రాంతాల జంటలు.. అబ్బాయిలు కావాలనే ఆలోచనతో బాలికలను పురిటిలోనే చంపేస్తున్నారు. ఈ కారణంగానే ఇండియాలో ఆడపిల్ల సంతతి చాల తగ్గింది. భారతదేశంలోని పురుషుల జనాభా 51.96% గా ఉండగా.. ఆడవారి జనాభా 48.02%. అంటే.. భారతదేశంలో 1000 మంది పురుషులకి.. 924 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందుకే.. ఈ దేశంలో మగవాళ్ళు వారి బెటర్ హాఫ్‌ను కనుక్కోవడం కష్టంగా మారింది.

నాల్గవ స్థానంలో చైనా.. ఇది ప్రపంచంలోనే అత్యదిక జనాభా గల దేశం. ఈ దేశంలో కూడా పురుషుల జనాభా.. స్త్రీల కంటే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 104.6 మంది పురుషులకి, కేవలం 100 మంది అమ్మాయిలే ఉన్నారు. ఆడవాళ్ళ జనాభా కంటే పురుషుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల.. ఇక్కడ అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందట.

అయిదవ స్థానంలో EGYPT.. ప్రస్తుత అరబ్ దేశాలలో ఎక్కువ జనాభా గల దేశం ఈజిప్ట్. జనాభఆ ఎక్కువగా ఉన్నా కానీ.. అమ్మాయిల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందట. ఇక్కడి అమ్మాయిలు తమ పై చదువుల కోసం.. ఇంకా ఇతర కారణాల కోసం బయటి దేశాలకి వెళ్లి అక్కడే సెటిల్ అవుతున్నారు. అమ్మాయిల సంతతి తగ్గడానికి అదే ముఖ్య కారణంగా చెబుతున్నారు ఆ దేశవాసులు. అందువల్లే ఇక్కడ చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.

ఆరవ స్థానంలో NIGERIA.. నైజీరియాలోని అమ్మాయిలు స్థానికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో బాల్య వివాహం, ఫెమినిన్ జెంటిల్ మ్యూటిలేషన్ మరియు పాలిగామి వంటి సమస్యలు ముఖ్యమైనవి. ఈ కారణంతోనే ఎక్కువమంది నైజీరియన్ ప్రజలు ఇతర దేశాలకి వలస వెళ్లి.. అక్కడి వాళ్లనే పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు జగరడం చాల కష్టంగా మారింది.

ఏడవ స్థానంలో AFGHANISTHAN.. ఈ దేశంలో.. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో యుద్ద వాతావరణం నెలకొని ఉంటుంది. ఎదో ఒక వివాదం వలన అత్యంత భయానక పరిస్థితులు నెలకొని ఉండటంతో ఆ దేశం మూతపడిపోయింది. చాలా మంది మహిళలు వారి బాగోగుల కోసం ఇక్కడి నుండి వలస వెళ్ళిపోతున్నారు. అందుకే ఆఫ్ఘానిస్తాన్లో మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆ భయానక పరిస్థితుల నుండి తమ దేశాన్ని బయటపడేయాలని పోరాటం చేయడం తప్ప మరేం చేయలేకపోతున్నారు పురుషులు.

ఇక చివరిగా IRAN.. ఇరాన్ దేశంలోని మహిళలు అత్యంత విద్యావంతులు. అందుకే.. చదువులోను, సంపదలోను వారితో సరిపోయే అబ్బాయిలను తమ భాగస్వామిని చేసుకోవడానికే ఇష్టపడతారు ఇరానీ అమ్మాయిలు. పైగా ఇరాన్‌లో ఎప్పుడూ ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉంటాయి. అందుకే ఇక్కడి అమ్మాయిలు వేరే దేశాలకి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. కళ్లముందే అందమైన అమ్మాయిలందరూ రెక్కలు కట్టుకుని పక్క దేశాలకు వెళ్లిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఇరాన్ అబ్బాయిలది.

మనసైన అమ్మాయిని మనువాడదామంటే ఒక్కరూ దొరకట్లేదని వాపోతున్నారు పురుష పుంగవులు.. అదండీ సంగతి.. పాపం పెళ్లి కోసం పురుషులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో..

Tags

Read MoreRead Less
Next Story