తల్లిదండ్రులకు దూరమైన ఇద్దరు చిన్నారులు.. కరోనాతో అమ్మా నాన్న

తల్లిదండ్రులకు దూరమైన ఇద్దరు చిన్నారులు.. కరోనాతో అమ్మా నాన్న
భార్యకు భర్తని, భర్తకు భార్యని, చిన్నారులకు తల్లి దండ్రులను, తల్లికి బిడ్డని.. ఇలా ఎంతో మందిని ఒంటరిని చేసింది

భార్యకు భర్తని, భర్తకు భార్యని, చిన్నారులకు తల్లి దండ్రులను, తల్లికి బిడ్డని.. ఇలా ఎంతో మందిని ఒంటరిని చేసింది మహమ్మారి కరోనా. తాజాగా చెన్నై వేలూరులోని కాట్పాడికి చెందిన దంపతులు రెండు రోజుల తేడాతో మృతి చెందారు.

వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు ఒంటరి వారయ్యారు. తొరప్పాడి ఎయిల్ నగర్ కు చెందిన శివరాజ్ (45) కాట్పాడిలో ఉన్నా టాస్మాక్ దుకాణంలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. శివరాజ్ కు అతని భార్య భామ (38)కు కరోనా పాజిటివ్ రావడంతో ఇద్దరూ వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో చికిత్సలు ఫలించక శివరాజ్ ఈనెల 24వ తేదీన మృతి చెందగా భామ బుధవారం మృతి చెందింది. వీరికి ఇమాన్ (10), జోయల్ (7) అనే ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని తమిళనాడు టాస్మాక్ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షుడు పెరియస్వామి విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story