Mallikarjun Kharge: ఖర్గే చేతికి కాంగ్రెస్ పగ్గాలు.. భారీ మెజారిటీతో విజయం..

Mallikarjun Kharge: ఖర్గే చేతికి కాంగ్రెస్ పగ్గాలు.. భారీ మెజారిటీతో విజయం..
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే బంపర్ విక్టరీ సాధించారు. ప్రత్యర్థి శశిథరూర్‌పై 6 వేల 825 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే బంపర్ విక్టరీ సాధించారు. ప్రత్యర్థి శశిథరూర్‌పై 6 వేల 825 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖర్గేకు 7 వేల 897 ఓట్లు రాగా....శశిథరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. థరూర్‌తో పోల్చితే ఖర్గేకు 8 రెట్లు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. మల్లిఖార్జున ఖర్గేకు శుభకాంక్షలు తెలిపారు శశిథరూర్‌.



తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అధ్యక్షుడి సారథ్యంలో పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు శశిథరూర్‌. ఖర్గే విజయంతో దాదాపు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినట్టయింది.



137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చాలా రోజుల తరువాత గాంధీయేతర వ్యక్తి అధ్యక్ష పీఠాన్ని చేపపట్టబోతున్నారు... కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ పై ఘన విజయం సాధించి పార్టీ చీఫ్‌ అయ్యారు. మరోవైపు ఇప్పుడు పార్టీ బాధ్యతలు చూస్తున్న సోనియా గాంధీ రేపో,ఎల్లుండో పదవీ విరమణ చేయనున్నారు.




సోనియా నిష్క్రమణతో కాంగ్రెస్​లో ఓ శకం ముగిసినట్లే! సోనియా కాంగ్రెస్‌లోనే కాకుండా దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కంటే కూడా ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ అధ్యక్షురాలిగా గుర్తింపు పొందారు.1998 నుంచి 2017 వరకు, 2019 నుంచి 2022 వరకు సుదీర్ఘకాలం పాటు ఆమె పార్టీని నడిపించారు.



కాంగ్రెస్‌ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగితే. తొలిసారిగా 1950లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ్ దాస్ గెలిచారు.1947 జరిగిన ఎన్నికల్లో సీతారామ్ కేసరి విజయం సాధించారు. 2000 సవంత్సరంలో జరిగిన ఎన్నికల్లో జితేంద్ర ప్రసాద్ పై సోనియా గాంధీ గెలిచారు.



స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లల్లో 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తొలిసారి 1998లో అధ్యక్షురాలైన సోనియా..19ఏండ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్.. 2019 వరకు కొనసాగారు. ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.



దీంతో మళ్లీ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.అయితే ఈసారి గాంధీకుటుంబేతర వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్‌తో ఎన్నికల నిర్వహరణకు పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. అనేక నాటకీయ పరిణామాల మధ్య బరిలో కేరళ నేత శశి థరూర్‌, మల్లిఖార్జన్‌ ఖర్గే నిలిచారు.. అయితే గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న ఖర్గే వైపే అందరు నేతలు మొగ్గు చూపారు..పార్టీ అధిష్టానం డైరక్ట్‌గా చెప్పకపోయినా ఖర్గే వైపే మొగ్గు చూపింది గాంధీ ఫ్యామిలీ.. దీంతో ఆయన వైపే కాంగ్రెస్‌ నేతలు నిలిచారు.


సహజంగా న్యాయవాది అయిన ఖర్గే 21 జూలై 1942 న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మాపన్న, శ్రీమతి సైబవ్వ. గుల్బర్గా స్టూడెంట్‌ యూనియన్‌ జనరల్ సెక్రటరీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఖర్గే అంచెలంచెలుగా ఎదిగారు.. కబడ్డీ,హాకీ,క్రికెట్ పై ఇంట్రెస్ట్ చూపే ఖర్గేకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. రాజకీయాలపై ఖర్గే నిబద్దత ఎలాంటిదంటే పోటీ చేసిన పదిసార్లలో తొమ్మిదిసార్లు కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు.


అలాగే కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు ఎన్నికైన ఆయన రైల్వే మంత్రిగా సేవలు అందించారు. ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి వివాద అంశాలు లేవు. ఇక ఆయనకు భార్య రాధాబాయి,ముగ్గురు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు..

Tags

Read MoreRead Less
Next Story