మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తీరు చూస్తే ఆందోళనకలుగుతుంది. ముఖ్యంగా ఈ మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బంది

X
Admin29 Aug 2020 7:55 AM GMT
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తీరు చూస్తే ఆందోళనకలుగుతుంది. ముఖ్యంగా ఈ మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బంది, పోలీసులు టార్గెట్ అవుతున్నారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలగా.. మరో ఐదుగురు ఈ మహమ్మారి కాటుకి బలైపోయారు. కాగా.. ఇప్పటికవరకూ రాష్ట్రంలో మొత్తం 14,792 మంది పోలీసులకు కరోనా సోకగా.. ఇప్పటివరకూ 11,867 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,772 మంది చికిత్స పొందుతున్నారు. 153 మంది కరోనాతో మరణించారు.
Next Story