కరోనా బారినపడిన ఏపీ మంత్రి
కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాజకీయ ప్రముఖులు

X
shanmukha28 Sep 2020 1:56 AM GMT
కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాజకీయ ప్రముఖులు విధినిర్వాహణలో ప్రజల్లోకి వస్తున్నారు. దీంతో ఇటీవల రాజకీయ నేతలు వరసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా బారినపడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేపించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సీఎం జగన్ తో కలిసి ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల నుంచి వచ్చిన తరువాత ఆయన కరోనా బారినపడ్డారు.
Next Story