మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 448 మంది మృతి
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

X
shanmukha10 Sep 2020 4:26 PM GMT
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 23,446 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 9,90,795కు చేరింది. అయితే, ఇప్పటివరకూ 7,00,715 కరోనా నుంచి కోలుకోగా..ఇంకా 2,61,432 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే 448 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 28,282కు చేరింది.
Next Story