జాతీయం

మరోసారి విజృంభిస్తున్న కరోనా.. మహారాష్ట్ర, కేరళ, ఏపీలో వేలల్లో కేసులు..!

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కేసులతోపాటు..మరణాల్లోను పెరుగుదల కనిపించడం ఆందోళన కల్గిస్తోంది.

మరోసారి విజృంభిస్తున్న కరోనా.. మహారాష్ట్ర, కేరళ, ఏపీలో వేలల్లో కేసులు..!
X

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కేసులతోపాటు..మరణాల్లోను పెరుగుదల కనిపించడం ఆందోళన కల్గిస్తోంది. కొత్తగా 39,742 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 535 మరణాలు మృత్యువాతపడ్డారు. ఇవాళ్టి మరణాలతో ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 4,20,551కి చేరాయి. రికవరీ కేసుల సంఖ్య సమానంగానే ఉంది. 39,972 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 4,8,212గా ఉన్నాయి.

రెండు నెలలక్రితం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది. ప్రాణభయంతో జనం వణికేలా చేసింది. గతంలో ఎన్నడులేనంత భయానక వాతావరణం సృష్టించింది. తర్వాత కేసులు తక్కుముఖం పట్టాయని అందరు ఊపిరిపీల్చుకుంటున్న ఈ సమయంలో .. మరోసారి కోవిడ్ బుసలు కొడుతోంది. కేసులు సంఖ్య పెరుగుతూ హెచ్చరిస్తోంది. మూడో దశ ముప్పు భయపెడుతోంది. ఈ నెల 15 నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల కేసులు వెలుగుచూస్తే.. బుధవారం ఒక్కరోజే 5 లక్షల55 వేల కేసులు నమోదయ్యాంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన దేశంలో కూడా ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది.

దేశంలో మొదటి, రెండో దశలు తొలుత కేరళ తర్వాత మహారాష్ట్ర అనంతరం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా కేరళ, మహారాష్ట్రలో కేసులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతంగా నమోదైంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 9 వేలకుపైగా కేసులు నమోదువుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. జూలై 8 నుంచి ప్రతి రోజూ సగటు 2 వేల కేసులు బయటపడ్డాయి.

తొలిదశలో కేసుల సంఖ్య వందలోపు నమోదవడం మొదలైన తర్వాత... రెండో దశ వ్యాప్తి ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం రెండో దశలో రోజుకు సగటున 2వేల కేసులు నమోదవున్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే థర్డ్‌ వేవ్‌ ప్రారంభమయ్యేలా ఉంది. కేరళ, మహారాష్ట్రల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. ఆగస్టులోనే మూడో దశ ప్రారంభం అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తగు జాగ్రత్త వహించకపోతే మాత్రం మరింత ప్రమాదకర పరిస్థితులను చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES