Covid-19 vaccine: నేటి సాయంత్రం నుంచే రిజిస్ట్రేషన్‌

Covid-19 vaccine: నేటి సాయంత్రం నుంచే రిజిస్ట్రేషన్‌
దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నేడు సాయింత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానుంది. మే 1 నుంచి వీరికి వ్యాక్సిన్ అందించనున్నారు.

దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నేడు సాయింత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానుంది. మే 1 నుంచి వీరికి వ్యాక్సిన్ అందించనున్నారు. దీనికోసం కొవిన్‌ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లోనూ తమ పేరు నమోదు చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్‌ ఖరారవుతుంది. కాగా 18ఏళ్లు పైబడినవారందరూ టీకా కోసం తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని, ఎలాంటి వాకిన్‌ రిజిస్ట్రేషన్లు ఉండబోవని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే.

కాగా దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా పరీక్షలు చేయగా.. 3,60,960 కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,79,97,267కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,293 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,01,187గా నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి ఒక్కరోజులోనే 2,61,162మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story