కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది: కేంద్రం

కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది: కేంద్రం
వైర‌స్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలు స‌త్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైర‌స్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలు స‌త్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈ వారంలో పాజిటివిటీ రేటు 21.9% నుంచి 19.8శాతానికి తగ్గిందని.. తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 85% 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు, 8 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులు, 17 రాష్ట్రాల్లో 50వేలలోపు కేసులు ఉన్నాయన్నారు. అటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,26,098 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 3,53,299 దిశ్కార్జ్ కాగా, 3,890 మరణాలు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story