రికవరీ రేటు పెరిగింది.. అయినా తేలిగ్గా తీసుకోవద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రి

రికవరీ రేటు పెరిగింది.. అయినా తేలిగ్గా తీసుకోవద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రి
దేశంలో కొవిడ్ రికవరీ రేటు 76.28 శాతానికి పెరిగిందని, అయినా మహమ్మారిని తక్కువ అంచనా వేయడానికి లేదని కేంద్ర ఆరోగ్య

దేశంలో కొవిడ్ రికవరీ రేటు 76.28 శాతానికి పెరిగిందని, అయినా మహమ్మారిని తక్కువ అంచనా వేయడానికి లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ శుక్రవారం అన్నారు. వైరస్ ఫలితంగా అత్యంత నష్టపోయిన జిల్లా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కేంద్రం 237 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించింది. దాన్ని ప్రారంభోత్సవ సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు. దేశం మొత్తం మీద దాదాపు నాలుగు కోట్ల కోవిడ్ పరీక్షలు జరిగాయని చెప్పారు. మిగిలిన దేశాలతో పోలిస్తే వైరస్ సంక్రమణ మన దేశంలో తక్కువగా ఉందని, అయినా తేలిగ్గా తీసుకోవద్దని అన్నారు.

నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ప్రాంత ప్రజలకు వ్యాధి గురించి అవగాహన కలిగించాలని అన్నారు. మనమందరం ఐక్యంగా పనిచేసి ప్రధాని మోదీ నాయకత్వంలో వైరస్ విజయం సాధిస్తామని తనకు పూర్తి నమ్మకం ఉందని మంత్రి అన్నారు. ఈ ఏడాది భోపాల్ లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాఖను ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వర్ధన్ తెలిపారు. కొవిడ్ తరహా పరిక్షలు నిర్వహించడానికి ఇక్కడ ఒక ప్రయోగశాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎంపీలో 14 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని వర్ధన్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story