జాతీయం

Earthquake : జమ్ముకశ్మీర్‌లో నిన్న రాత్రి భూకంపం..!

Earthquake : భూకంపం, భూ ప్రకంపనలు వణికించాయి. సంక్రాంతి వేళ సంబరాల్లో ఉన్న సమయంలో.. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు భయం పుట్టించాయి.

Earthquake : జమ్ముకశ్మీర్‌లో నిన్న రాత్రి భూకంపం..!
X

Earthquake : భూకంపం, భూ ప్రకంపనలు వణికించాయి. సంక్రాంతి వేళ సంబరాల్లో ఉన్న సమయంలో.. శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు భయం పుట్టించాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో.. జనం భయంతో పరుగులు తీశారు. తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలోనూ గత అక్టోబర్‌లో భూమి కంపించింది. జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి.

జమ్ము కశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. జమ్ము కశ్మీర్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందు కుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. రాత్రి పది గంటల సమయంలో భూకంపం రావడంతో భయపడిపోయారు. ఈ భూకంపంలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ నిన్న రాత్రి 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ -తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదై ఉందని తెలిపింది. పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి.

అటు ఇండోనేషియాలోనూ భూకంపం సంభవించింది. 6.6 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకైతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

Next Story

RELATED STORIES