అరవై అడుగుల బోరు బావిలో పడిన గున్న ఏనుగు

అరవై అడుగుల బోరు బావిలో పడిన గున్న ఏనుగు

ఆహారం కోసం వెతుకుంటున్న ఓ గున్న ఏనుగు ప్రమాదంలో పడింది. పొరపాటున అరవై అడుగుల లోతు ఉన్న ఓ బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఏనుగు ఘీంకారాలు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరు సమీపంలోని ఎలగుండూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం ఉదయం నుంచి శ్రమించిన అధికారులు ఎట్టకేలకు భారీ యంత్రాల సహాయంతో అదే రోజు రాత్రి బయటకు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story