మరోసారి భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు
సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల మధ్య రోజురోజుకు ఉద్రిక్తత పెరుగుతుంది.

X
shanmukha8 Sep 2020 2:07 AM GMT
సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల మధ్య రోజురోజుకు ఉద్రిక్తత పెరుగుతుంది. ఇటీవల గల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే, ఈ విషయాన్ని మర్చిపోకముందే మరోసారి ఇరు దేశాల సైనికులు మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. సోమవారం అర్థరాత్రి భారత్, చైనా బలగాల మధ్య తూర్పు లడ్డాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగాయని.. అయితే, భారత సైనికులే మందుగా కాల్పులు జరిపారని.. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా ఎదురుదాడి చేసిందని చైనా ప్రభుత్వ మీడియా, ఆర్మీ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకూ భారత్ ప్రభుత్వం మాత్రం చైనా ఆరోపణలపై స్పందించలేదు. గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తరువాత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Next Story