Garlic Pickles: మందసౌర్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన 'వెల్లుల్లి'..

Garlic Pickles: మందసౌర్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన వెల్లుల్లి..
Garlic Pickles: ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది.. ఏదో ఒకపని చేస్తే ఎంతో కొంత సంపాదించొచ్చు.. ఎవరి మీద ఆధారపడకుండా బతకొచ్చు.

Garlic Pickles: ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది.. ఏదో ఒకపని చేస్తే ఎంతో కొంత సంపాదించొచ్చు.. ఎవరి మీద ఆధారపడకుండా బతకొచ్చు.. ఆ ఆలోచనతోనే ఆ గ్రూపులో జాయినయ్యారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మందసౌర్ మహిళలు. మహిళల స్వయం సహాయక సంఘాలు వెల్లుల్లితో తయారు చేసిన పదార్థాల ఉత్పత్తిని ప్రారంభించాయి. వారు తమ కష్టార్జితానికి జీవనోపాధిని ఎంచుకోవడమే కాకుండా, ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.


మందసౌర్‌లోని హింగోరియా బడా గ్రామంలోని మహిళలు ఆర్థికంగా స్వతంత్రులయ్యారు. వెల్లుల్లి ఈ మహిళల జీవితాలను మార్చేసింది. వెల్లుల్లితో పచ్చళ్లు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వెల్లుల్లి ఊరగాయ ప్రజల అభిరుచిలో ప్రత్యేక ఎంపికగా మారింది. మందసౌర్ జిల్లాలో వెల్లుల్లిని ఎక్కువ మొత్తంలో పండిస్తారు.

హింగోరియా బడా గ్రామానికి చెందిన ఈ మహిళా సంఘం తయారుచేసే పచ్చళ్లకు ఎంత డిమాండ్ ఏర్పడిందంటే.. ఇప్పుడు 5 కిలోల బదులు 800 కిలోల పచ్చళ్లు తయారవుతున్నాయి. వెల్లుల్లి ఊరగాయకు మందసౌర్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. వెయ్యి రూపాయల నుంచి మొదలైన సంపాదన ఇప్పుడు లక్షల రూపాయలకు చేరుకుంది.


జిల్లాలో 2533 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. 29000 మంది మహిళలు ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడి ప్రధాన పంటలు నల్లమందు మరియు వెల్లుల్లి. ప్రతి సంవత్సరం 19100 హెక్టార్ల విస్తీర్ణంలో 191558.4 మెట్రిక్ టన్నుల వెల్లుల్లి ఉత్పత్తి అవుతోంది. చుట్టుపక్కల జిల్లాతో పాటు, రాజస్థాన్ నుండి వచ్చిన వెల్లుల్లి కూడా మందసౌర్ మార్కెట్‌లో విక్రయించబడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story