Gurugram: కోవిడ్ భయం.. మూడేళ్ల నుంచి తల్లీ కొడుకులు తాళం వేసుకుని ఇంట్లోనే..

Gurugram: కోవిడ్ భయం.. మూడేళ్ల నుంచి తల్లీ కొడుకులు తాళం వేసుకుని ఇంట్లోనే..
Gurugram: కోవిడ్ కొన్ని వేల మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆ భయం నుంచి కోలుకుని ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు.

Gurugram: కోవిడ్ కొన్ని వేల మంది జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆ భయం నుంచి కోలుకుని ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ గురుగ్రామ్‌ చక్కర్‌పూర్ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన మైనర్ కొడుకు ఇంకా ఆ భయం నుంచి బయటకు రాలేదు. తల్లీ కొడుకులు ఇద్దరూ తాళం వేసుకుని ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారుల బృందం వారిని బలవంతంగా బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చింది.

పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ సభ్యుల బృందం ఇంటి ప్రధాన తలుపును తెరిచి మున్మున్ మాఝీ, ఆమె 10 ఏళ్ల కొడుకును రక్షించినట్లు తెలిపారు. అనంతరం వారిని ఇక్కడి సివిల్ ఆసుపత్రికి తరలించారు. "మహిళ కొన్ని మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని గుర్తించారు. దాంతో ఆమెను చికిత్స కోసం మానసిక వార్డులో ఉంచాము అని గురుగ్రామ్‌లోని సివిల్ సర్జన్ డాక్టర్ వీరేందర్ యాదవ్ చెప్పారు. మున్మున్ భర్త సుజన్ మాఝీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్.

2020లో మొదటి లాక్‌డౌన్ తర్వాత ఆంక్షలు సడలించినప్పుడు ఆఫీస్‌కి వెళ్లేందుకు బయటకు వచ్చిన భర్తను కూడా ఇంట్లోకి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. సుజన్ మొదటి కొన్ని రోజులు స్నేహితులు, బంధువుల ఇంట్లో గడిపాడు. ఇంట్లోకి రావడానికి భార్య అనుమతించకపోవడంతో, అతడు అదే ప్రాంతంలో మరొక ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు.

తన భార్య, కొడుకుతో మాట్లాడడానికి వీడియో కాల్స్ చేసేవాడినని సుజన్ చెప్పాడు. ఇంటికి సంబంధించిన సరుకులన్నీ తెచ్చి మెయిన్ డోర్ వద్ద పెట్టి వెళ్లే వాడినని సుజన్ పోలీసులకు తెలిపాడు. గత మూడేళ్లుగా కొడుకు స్కూల్ కాదుకదా కనీసం సూర్యుడిని కూడా చూడలేదు అని బాధతో చెప్పాడు సుజన్. భార్య ఎంతకీ తన మాట వినడం లేదని పోలీసులను ఆశ్రయించాడు సుజన్. అయితే అతడి మాటలను మొదట పోలీసులు నమ్మలేకపోయారు. దాంతో వారి దినచర్యను గమనించిన తరువాత పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. ఆమె నివసించే ఇంట్లో చాలా చెత్తా చెదారం పేరుకుని ఉండడాన్ని గుర్తించారు.

మూడేళ్ల తర్వాత బయటు వచ్చిన తన భార్య, కొడుకును చూసి సుజన్ కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మోడు వారిన నా జీవితం మళ్లీ చిగురించింది అని ఆనందంతో చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story