Top

కరోనాపై పోరాటం కొనసాగుతుంది: హర్షవర్థన్

కరోనాపై పోరాటం ఇంకా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ద‌న్‌ చెప్పారు. రాజ్యసభలో కరోనాపై జరిగిన చర్చలో

కరోనాపై పోరాటం కొనసాగుతుంది: హర్షవర్థన్
X

కరోనాపై పోరాటం ఇంకా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ద‌న్‌ చెప్పారు. రాజ్యసభలో కరోనాపై జరిగిన చర్చలో ఈ మేరకు సమాధానం చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా మరణాల రేటు 1.67 శాతంగా, రికవరీ రేటు 77.65 శాతంగా ఉందని ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. చాలా కరోనా కట్టడిలో చాలా మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కేసుల సంఖ్యను ప్రతి మిలియన్‌కు 3,320కి, మరణాలను ప్రతి మిలియన్‌కు 55కు పరిమితం చేయగలిగామని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు. కాగా, సోమ‌వారం కొత్త‌గా 83,809 కేసులు నమోదయ్యాయి. 1,054 మంది మరణించారు.

Next Story

RELATED STORIES