Gujarat: బస్ డ్రైవర్ కు గుండె పోటు.. స్టీరింగ్ తిప్పిన విద్యార్థిని..

Gujarat: బస్ డ్రైవర్ కు గుండె పోటు.. స్టీరింగ్ తిప్పిన విద్యార్థిని..
Gujarat: బస్ డ్రైవర్ కు గుండె పోటు రావడంతో ఒక పక్కకు ఒరిగిపోయాడు. దీంతో పక్కనే కూర్చున్న విద్యార్థిని వెంటనే అప్రమత్తమైంది.

Gujarat: బస్ డ్రైవర్ కు గుండె పోటు రావడంతో ఒక పక్కకకు ఒరిగిపోయాడు. దీంతో పక్కనే కూర్చున్న విద్యార్థిని వెంటనే అప్రమత్తమైంది. అదుపుతప్పిన బస్సు స్టీరింగ్ వీల్‌ను 17 ఏళ్ల బాలిక చేతబట్టి బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరి ప్రాణాలను కాపాడింది.

ట్రాంబాలో భరద్ డే స్కూల్ ఉన్నందున, బస్సు డ్రైవర్ హరున్‌భాయ్ ఖిమానీ ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు విద్యార్థులను తీసుకెళ్లడానికి బస్సులో వెళ్తాడు. అయితే శనివారం పాఠశాలలో వార్షికోత్సవం ఉండడంతో విద్యార్థులను ఎక్కించుకునేందుకు డ్రైవర్ మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు.

ఆ మార్గంలో ముందుగా విద్యార్థి భార్గవి వ్యాస్‌ ఇల్లు ఆస్ట్రాన్‌ చౌక్‌ సమీపంలోకి వస్తుండగా విద్యార్థినిని బస్సులో ఎక్కించారు. ఆ తర్వాత ఇతర విద్యార్థులను ఎక్కించుకునేందుకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే బస్సు గొండాల్‌ రోడ్డులోని మక్కం చౌక్‌ సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో బస్సులో కూర్చున్న విద్యార్థిని డ్రైవర్‌ వద్దకు వచ్చి ఏం జరిగిందని అడిగింది. కానీ అప్పటికే డ్రైవర్ బస్సు స్టీరింగ్‌పై తల వాల్చేశాడు. దీంతో విద్యార్థి భయాందోళనకు గురైంది.

17 ఏళ్ల విద్యార్థినికి బస్సు నడపడం తెలియక పోయినా.. వెంటనే స్టీరింగ్‌ పట్టుకుని పాదచారుల వైపు వెళ్తున్న బస్సును ధైర్యంగా ఆపడానికి ప్రయత్నించింది. దీంతో బస్సు ఓ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల ప్రజలు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. డ్రైవర్‌ను వెంటనే సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

నడుస్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన ఘటనలో పెను ప్రమాదాన్ని నివారించిన భార్గవి వ్యాస్ అనే బాలిక మాట్లాడుతూ.. డ్రైవర్ పడిపోవడం చూసి భయపడ్డాను.. అయితే బస్సులో ఉన్న వారిని కాపాడాలనుకున్నాను.

అలా బస్సు స్టీరింగ్‌ తిప్పుతుండగా సబ్‌స్టేషన్‌కు ఢీకొని బస్సు ఆగింది. కాబట్టి మేమందరం బతికి పోయాం అని చెప్పుకొచ్చింది బార్గవి.

భార్గవి తల్లిదండ్రులు కూతురు చేసిన పనికి మెచ్చుకుంటూ.. మా అమ్మాయికి కొడుకులానే అన్ని అధికారాలు ఇచ్చి పెంచా మని భార్గవి తల్లి అన్నారు. విపత్కర సమయాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించామన్నారు. అదే ఇప్పుడు అక్కరకొచ్చిందని తమ బిడ్డను చూసి ఉప్పొంగి పోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story