Mysore: భిక్షాటన చేసిన డబ్బులతో మనవరాలిని బాక్సర్‌ని చేసిన హిజ్రా

Mysore: భిక్షాటన చేసిన డబ్బులతో మనవరాలిని బాక్సర్‌ని చేసిన హిజ్రా
Mysore: అందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పి ఆమెను కిక్ బాక్సింగ్ పోటీలకు పంపించాడు.

Mysore: సమాజం నుంచి చీత్కారాలు.. వారిని చూస్తే అసహ్యించుకునే వారే ఎక్కువ.. అయినా బ్రతుకు పోరాటం.. చేద్దామంటే పని ఇచ్చే వాళ్లు ఉండరు.. కడుపు నింపుకోవడం కోపం బిచ్చమెత్తుకోవడం ప్రారంభించారు మైసూరుకు చెందిన అక్రం పాషా అలియాస్ షబానా అనే ఓ హిజ్రా. బిచ్చమెత్తుకుని సంపాదించిన డబ్బుని ఓ మంచి పనికి వినియోగించాలనుకున్నాడు..

మనవరాలి వరుస అయిన బీబీ ఫాతిమా నగరంలోని సెయింట్ ఆంథోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.. బాక్సింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్న ఆమెను ప్రోత్సహించాడు.. అందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పి ఆమెను కిక్ బాక్సింగ్ పోటీలకు పంపించాడు. ఫాతిమా తాత ఇచ్చిన ధైర్యంతో నమహారాష్ట్ర పూణేలో నిర్వహించిన వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది.

శిక్షణకు అవసరమైన ఆర్ధిక వనరులన్నీ అక్రం పాషా సమకూర్చారు. తాత ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు నేషనల్ లెవల్లో బంగారం పతకం సాధించాను. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడి పతకం సాధించేందుకు ప్రయత్నిస్తాను అని ఆనందంతో చెబుతోంది ఫాతిమా.

Tags

Read MoreRead Less
Next Story