జాతీయం

Chennai: హిందీ మాట్లాడేవారు పానీపూరీ అమ్ముకుంటున్నారు: మంత్రి షాకింగ్ కామెంట్స్

Chennai: దేశవ్యాప్తంగా హిందీ భాష అమలుపై చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Chennai: హిందీ మాట్లాడేవారు పానీపూరీ అమ్ముకుంటున్నారు: మంత్రి షాకింగ్ కామెంట్స్
X

Chennai: తమిళనాడు విద్యా శాఖ మంత్రి కె పొన్ముడి దేశంలో కొనసాగుతున్న భాషా చర్చకు ఆజ్యం పోశారు. .కోయంబత్తూరులో హిందీ మాట్లాడే వారంతా పానీ పూరీలను విక్రయిస్తున్నారని అన్నారు". దక్షిణాది రాష్ట్రంలోని ప్రజలు ఎప్పుడూ భాష నేర్చుకోవడంలో ముందుంటారు అని ఆయన అన్నారు. తమిళ ప్రజలకు తమిళంతో పాటు ఇంగ్లీష్ వచ్చు. మరి అప్పుడు ఇతర భాషల అవసరం ఏముంటుందని ఆయన అన్నారు.

కోయంబత్తూరులోని భారతియార్ యూనివర్శిటీలో జరిగిన ఒక స్నాతకోత్సవ కార్యక్రమంలో తమిళనాడు మంత్రి ప్రసంగిస్తూ, "తమిళనాడులో రెండు భాషలు ఉన్నాయి - ఇంగ్లీష్ మరియు తమిళం. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అయితే, తమిళం స్థానిక భాష."

"హిందీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని మాకు చెప్పారు. మాకు వచ్చిందా? మీరు వెళ్లి మా రాష్ట్రంలో మరియు కోయంబత్తూరులో పానీ పూరీలు అమ్మే వ్యక్తులు ఎవరో చూడండి" అని అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవితో ఆయన వేదిక పంచుకున్నారు..

కె పొన్ముడి మాట్లాడుతూ, "ఇంగ్లీష్ ఒక అంతర్జాతీయ భాష. "అంతర్జాతీయ భాష ఇంగ్లీషు నేర్చుకుంటున్నాం. ఇతర భాషల అవసరం ఏమిటి?" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రశ్నించారు.

భారతదేశంలో విద్యావ్యవస్థలో తమిళనాడు ముందంజలో ఉందని, తమిళ విద్యార్థులు ఏ భాషనైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పొన్ముడి పేర్కొన్నారు. అయితే హిందీ ఐచ్ఛిక భాషగా మాత్రమే ఉండాలని, తప్పనిసరి భాష కాదని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా హిందీ భాష అమలుపై చర్చ నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Next Story

RELATED STORIES