ఒకప్పుడు పొట్టకూటి కోసం గాజులు అమ్మాడు.. ఇప్పుడు IAS ఆఫీసర్!

ఒకప్పుడు పొట్టకూటి కోసం గాజులు అమ్మాడు.. ఇప్పుడు IAS ఆఫీసర్!
కష్టాలు అందరికీ వస్తాయి.. అయితే వాటిని తట్టుకునే ముందుకు వెళ్ళినప్పుడే విజయాలు దక్కుతాయి.. ఈ మాటకి నిలువెత్తు రూపం.. రమేష్‌ గోలప్‌..

రమేష్‌ గోలప్‌ కి చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. స్పోర్ట్స్ గేమ్స్ ఆడేవాడు కాదు.. కానీ ఆ అంగవైకల్యాన్ని చూసి ఎప్పడు కూడా తన ఆత్మవిశ్వాసాన్ని చెదరనివ్వలేదు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు.. రమేష్‌ గోలప్‌ తండ్రి సైకిల్‌ షాపుని నడిపించేవాడు. వచ్చే ఆదాయంతోనే ఇంటిని పోషించేవాడు.. ఆర్ధికంగా ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ తాగుడు మాత్రం మారలేదు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం దెబ్బతింది..

మరో ఆదాయ మార్గం లేకపోవడంతో రమేష్‌ గోలప్‌ తల్లి వీధి వీధి తిరుగుతూ గాజులు అమ్మేది.. ఆమెకి తోడుగా రమేష్‌ గోలప్‌ కూడా వెళ్ళేవాడు.. రమేష్‌ గోలప్‌ ఇంటర్ చదువుతున్న క్రమంలో అతని తండ్రి చనిపోయాడు. ఆ సంఘటన అతని చదువు పైన తీవ్రమైన ప్రభావం చూపిచింది. కానీ..తల్లి ధైర్యం చెప్పింది. చదువు ఆపొద్దని హితబోధ చేసింది.

ఆ దైర్యంతోనే ఇంటర్ లో 88.5 శాతం మార్కులు సాధించాడు. పై చదువులు చదవాలని ఉన్నప్పటికీ ఆర్ధిక స్తోమత అంతతమాత్రం కావడంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డీఎడ్‌ కోర్సులో చేరాడు. ఇక 2005 లో ఓ స్కూల్‌లో టీచర్‌గా జాయినయ్యాడు. ఆ ఉద్యోగం రమేష్ కు సంతృప్తినివ్వలేదు. ఇంకా ఎదో సాధించాలనే కోరిక బలంగా అతనిలో కలిగింది.

తల్లి తీసుకున్న రుణంతో పూణేకి వెళ్లి అక్కడ యూపీఎస్సీ పరీక్షకు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు.. కానీ ఫస్టు ఎటెమ్ట్ లో ఫెయిల్ అయ్యాడు. అలా అని పట్టు వదలలేదు.. మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలు రాసి తహసీల్దార్‌ ఉద్యోగం సంపాదించాడు.

అది కూడా మనోడికి సంతృప్తిని ఇవ్వలేదు. మళ్ళీ రాత్రి, పగలు కష్టపడి 2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 287వ ర్యాంకు సాధించాడు. IAS అయ్యాడు. అలా 2012 మే 4న IAS అధికారిగా తన సొంత ఊరిలో అడుగుపెట్టాడు. తమ కళ్ళముందు గాజులు అమ్మకున్న యువకుడు నేడు IAS అధికారిగా రావడంతో అతడిని ఊరేగింపుతో స్వాగతం పలికారు.

Tags

Read MoreRead Less
Next Story