Meghalaya: నేను గొడ్డు మాంసం తింటాను.. ఆ విషయం పార్టీకి కూడా తెలుసు: రాష్ట్ర చీఫ్

Meghalaya: నేను గొడ్డు మాంసం తింటాను.. ఆ విషయం పార్టీకి కూడా తెలుసు: రాష్ట్ర చీఫ్
Meghalaya: నేను గొడ్డు మాంసం తింటాను. దానితో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు అని మేఘాలయ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ అన్నారు.

Meghalaya: నేను గొడ్డు మాంసం తింటాను. దానితో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు అని మేఘాలయ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేఘాలయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ, పార్టీ సభ్యులు ఎవరైనా బీఫ్ తింటే ఇబ్బంది లేదని అన్నారు. తాను గొడ్డు మాంసం తింటానని, ఆ విషయం పార్టీకి కూడా తెలుసునని మావ్రీ వెల్లడించారు.

మావ్రీ మాట్లాడుతూ కాషాయ పార్టీలో గొడ్డు మాంసం తినడంపై ఎటువంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. బీజేపీ కులం,మతం గురించి ఆలోచించదని అన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మావ్రీ, తాను గొడ్డు మాంసం తింటానని, దానితో పార్టీకి ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు.

అవి మన ఆహారపు అలవాట్లు. వాటితో రాజకీయ పార్టీలకు ఏమిటి సంబంధం అని అన్నారు. మేఘాలయలో ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారని, రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన అన్నారు. ఇది మన అలవాటు, సంస్కృతి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్టీ విజయంపై మావ్రీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్‌పిపి, యుడిపిల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అన్నారు. 'రాబోయే ఎన్నికల్లో కనీసం 34 సీట్లు గెలుస్తాం. మాకు ఓటు వేయాలా వద్దా అనేది ఇప్పుడు ప్రజలపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరగాలంటే ప్రజలు కచ్చితంగా బీజేపీకి ఓటు వేయ్యాలి అని మావ్రీ పేర్కొన్నారు.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27, 2023న జరగనున్నాయి, ఫలితాలు మార్చి 2న ప్రకటించబడతాయని భావిస్తున్నారు. 10వ మేఘాలయ అసెంబ్లీ పదవీకాలం మార్చి 15, 2023తో ముగియనుంది.

Tags

Read MoreRead Less
Next Story