కరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్.. !

కరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్.. !
కరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజే లక్షా 26 వేల కేసులు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

కరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజే లక్షా 26 వేల కేసులు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. సెకండ్‌వేవ్‌లో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. అన్ని రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా ఒక లక్షా 26వేల 789 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 685 మంది చనిపోయారు.

తాజా లెక్కలతో కలిపి ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య కోటి 29 లక్షల 28వేల 574కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి లక్షా 66వేల 862 మంది చనిపోయారు. దేశంలో ఇంకా 9 లక్షల 10వేల 319 యాక్టివ్ కేసులున్నాయి.

ఎప్పటిలాగానే మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 59వేల 907 మందికి కరోనా సోకింది. ఛత్తీస్‌గఢ్‌లో 10వేల 310 మందికి, కర్నాటకలో 6వేల 976, తమిళనాడులో 3వేల 986, కేరళలో 3వేల 502 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

Tags

Read MoreRead Less
Next Story