Top

దేశానికి నాలుగు రాజధానులుండాలి : మమతా బెనర్జీ

నేతాజీ 125 పుట్టినరోజు సందర్భంగా కోల్ కతాలో ర్యాలీ నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశానికి నాలుగు రాజధానులుండాలి : మమతా బెనర్జీ
X

నేతాజీ 125 పుట్టినరోజు సందర్భంగా కోల్ కతాలో ర్యాలీ నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సువిశాల భారతదేశానికి ఒకే రాజధాని ఉండాలా అని ప్రశ్నించారు. దేశానికి నాలుగు రాజధానులుండాలని.. నాలుగు ప్రాంతాల్లో పార్లమెంట్ సమావేశాలు జరగాలన్నారు.

"భారతదేశానికి నాలుగు రాజధానులు ఉండాలి అని నేను నమ్ముతున్నాను. ఆంగ్లేయులు మొత్తం దేశాన్ని కోల్‌కతా నుండి పరిపాలించారు. మన దేశంలో ఒకే రాజధాని నగరం ఎందుకు ఉండాలి" అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

కాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ నాడు నేతాజీని దేశనాయక్ అని సంబోధించారని, అందుకే తాము ఆయన జయంతిని దేశనాయక్ దివస్ గానే జరుపుకుంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లానింగ్ కమిషన్, భారత ఆర్మీ ఏర్పాటులో ఆ మహనీయుడు కీలక పాత్ర పోషించారన్నారు.

Next Story

RELATED STORIES