Top

ఆశలు చిగురిస్తున్న వేళ.. రికవరీ కేసుల పెరుగుదల

మొత్తం రికవరీలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

ఆశలు చిగురిస్తున్న వేళ.. రికవరీ కేసుల పెరుగుదల
X

కోవిడ్ -19 కేసుల రికవరీ రేటు 80 శాతం దాటిందని, వరుసగా మూడో రోజు 90,000 రికవరీలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 93,356 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. "భారతదేశం 80 శాతానికి పైగా జాతీయ రికవరీ రేటు యొక్క ముఖ్యమైన మైలురాయిని దాటింది. నిరంతరం అధిక రికవరీలను నమోదు చేస్తున్న భారత్‌ వరుసగా మూడవ రోజు 90,000 కంటే ఎక్కువ రికవరీలను నమోదు చేసింది అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువ రికవరీ రేటును నమోదు చేశాయి. కొత్తగా కోలుకున్న కేసులలో 79 శాతం 10 రాష్ట్రాలు మరియు యుటిల నుండి వచ్చాయి. "మొత్తం కోలుకున్న కేసులు 44 లక్షలకు (43,96,399) దగ్గరగా ఉన్నాయి. మొత్తం రికవరీలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే కేసుల సంఖ్య తగ్గడానికి కారణం పరీక్షల సంఖ్య తగ్గడమా లేదా నిజంగానే వైరస్ సంక్రమణం తిరోగమనంలో సాగుతోందా అన్నది అంచనాకు రావడం లేదు.

గత నాలుగు రోజులుగా రోజువారీ పరీక్షల సంఖ్యలో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కానీ కేరళ, ఒడిశా, రాజస్థాన్‌లలో మాత్రం 24 గంటల్లో గరిష్టంగా కేసులు వచ్చాయి. అన్నిటికంటే అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవులు, దమణ్-దీప్, బిహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో రోజువారీ కంటే మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో 76% కేసులు, 86% మరణాలు కేవలం పది రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. పరీక్షల సంఖ్య 7,31,534కి తగ్గిపోయింది.

Next Story

RELATED STORIES