జాతీయం

Republic Day 2022 : మంచుకొండల్లో మువ్వన్నెల జెండా.. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో

Republic Day 2022 :లద్దాఖ్‌లో మన జవాన్లు గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి సారభౌమత్వాన్ని సగర్వంగా చాటారు.

Republic Day 2022 : మంచుకొండల్లో మువ్వన్నెల జెండా.. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో
X

Republic Day 2022 : మంచుకొండల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. లద్దాఖ్‌లో మన జవాన్లు గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి సారభౌమత్వాన్ని సగర్వంగా చాటారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌- ITBP టీమ్‌ ఆధ్వర్యంలో సముద్రమట్టానికి 15 వేల అడుగుల ఎత్తున మన జెండా రెపరెపలాడింది.

మైనస్ డిగ్రీల చలిలోనూ దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి మరీ పహారా కాస్తున్న సైనికులు.. రిపబ్లిక్ డే సందర్బంగా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని, మిఠాయిలు పంచుకున్నారు.ఉత్తరాఖండ్‌లోనూ ITBP సేనలు గణతంత్ర దినోత్సవాన్ని గొప్పగా జరుపుకున్నాయి.

కుమాన్ ప్రాంతంలో మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో, ఎముకలు కొరికేసే చలిలోనూ దేశభక్తిని చాటుతూ జవాన్లంతా జాతీయ జెండాను ఎగురవేశారు. ఓలిలోనూ తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య కాపలా కాస్తున్న హిమవీర్‌లు ఐస్ స్కేటింగ్‌తో జాతీయ జెండాను రెపరెపలాడించారు.

Next Story

RELATED STORIES